Wednesday, January 15, 2025

విలీన రాజకీయాల్లో లీనం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ కన్నా చాలా ముందే తనది జాతీయ పార్టీ అని, తాను ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిననీ, తన కుమారుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి అని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించుకున్నారు. అయితే ఆయన తెలంగాణ వదిలిపెట్టి 2015లో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయాక తెలంగాణలో పార్టీ దాదాపుగా మూతపడింది. పరిస్థితు లూ బాగా మారాయి. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బలంగా తలపడే క్రమంలో తెలంగాణ అస్తిత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ బిఆర్‌ఎస్సే ఉనికి కోసం పోరాడుతుంటే చంద్రబాబు వచ్చి ఏం చేస్తారు అన్నది ఇక్కడ ప్రశ్న. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన మళ్ళీ తెలంగాణలో చక్రం తిప్పుతానని చంద్రబాబు అనుకుంటే అది భ్రమ. గతంలో ఆయన తెలంగాణలో నియమించిన పార్టీ అధ్యక్షులు వరుసగా అధికార పక్షానికి వలసపోయిన విషయం ఆయన మరిచిపోయి ఉండరు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ బిజెపిలో చేరుతుందని చెపుతూ ఎవరెవరికి ఏ పదవులు లభిస్తాయో కూడా చెప్పేశారు. ఇది వాస్తవం కాకపోయినా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే ఆయన వద్ద ఏదన్నా సమాచారం నిజంగానే ఉందేమో అన్న అనుమానం కొంత అయినా కలగకపోదు. వెంటనే దానికి విరుగుడుగా కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు సంజయ్ బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కానుందని, అక్కడ ఎవరెవరికి ఏ పదవులు లభించనున్నాయో చెప్పారు. ఇది మొత్తానికి విషయాన్ని తేలిక చేసినా ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రెండు జాతీయ పార్టీలూ బిఆర్‌ఎస్‌ను ఒక ఆట ఆడుకుంటున్నాయన్నది మాత్రం వాస్తవం.

తెలంగాణ రాజకీయాల్లో ఒక వింత పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ప్రధాన రాజకీయ పక్షాలలో ఒక పార్టీకి మినహాయిస్తే దేనికీ అధ్యక్షులు లేరు. పార్టీలు పని చేస్తున్నాయి కదా అధ్యక్షులతో ఏం పని అని ఎవరైనా అనవచ్చు. ప్రాంతీయ పార్టీలకు అయితే అధ్యక్షుల ప్రాధాన్యత ఉంటుందేమో కానీ జాతీయ పార్టీలకు ఎవరు అధ్యక్షులుగా ఉన్నా ఏం ప్రయోజనం, స్వతంత్రంగా పని చేయలేరు కదా అని కూడా వ్యాఖ్యానించవచ్చు. నిజమే ఇప్పుడు తెలంగాణలో రెండు జాతీయ పార్టీలూ బలంగా ఉన్నాయి. ఎంత బలంగా అంటే 13 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం సాగించి రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చి దాదా పు 10 ఏళ్లు తెలంగాణను పాలించిన ప్రధాన ప్రాంతీయ పార్టీకి ఊపిరి సలపని విధంగా. ఆ పార్టీ భారత రాష్ట్ర సమితి తనదీ జాతీయ పార్టీ అని ప్రకటించుకుని పేరు మార్చుకున్నా తెలంగాణ సరిహద్దులు దాటి వెళ్లలేని స్థితిలో స్వరాష్ట్రంలో కూడా పలచబడిపోయిన పరిస్థితి. ఆ పార్టీకి అధ్యక్షుడు ఉన్నా సమస్యల మీద పోరాటానికి ఆయన ప్రజాక్షేత్రంలో ఎక్కడా కనబడరు. సమయం వచ్చినప్పుడు ఆయన కదనరంగంలో దూకుతారని అనుయాయులు చెప్తున్నా ఆ సమయం ఎప్పుడొస్తుందో వాళ్ళకు కూడా తెలియదు. తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రతిపక్ష నాయకుడి ఉనికి లేకుండానే జరిగిపోతున్నాయి.

తెలంగాణ శాసనసభలో బలం లేకపోయినా గతం కంటే మె రుగ్గా 8 స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్‌సభలో ఏకంగా కాంగ్రెస్‌తో సమానంగా 8 స్థానాలు సం పాదించి తన బలాన్ని బాగా పెంచుకుంది. తెలంగాణలో బిజె పి ఇంత బలం పెంచుకోడానికి ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి సహజ ప్రజాబలం పెరగడం మాత్రం కారణం కాదు. పదేళ్ళు అధికారంలో ఉండి తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను కొనితెచ్చుకున్న భారత రాష్ట్ర సమితి కారణం. బిఆర్‌ఎస్ ఎంత బలహీనపడితే బిజెపికి అంత లాభం అన్న విషయం ఇప్పటికే రుజువైంది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో కనీసం నాలుగు స్థానాల్లో బిఆర్‌ఎస్ పరోక్షంగానే అయినా బిజెపి గెలుపునకు దోహదపడిందన్న ప్రచారంలో కొంత నిజం లేకపోలేదు. అగ్ర నా యకత్వం మాట ఎ ట్లా ఉన్నా కింది స్థా యిలో స్థానిక నాయకత్వం, శ్రేణులూ తమ పార్టీ బలహీనపడిందని అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూడటం సహజం .

ఒక దశలో బిఆర్‌ఎస్‌ను బిజెపిలో విలీనం చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగినది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా తో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ బిజెపిలో చేరుతుందని చెపుతూ ఎవరెవరికి ఏ పదవులు లభిస్తాయో కూడా చెప్పేశారు. ఇది వాస్తవం కాకపోయినా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే ఆయన వద్ద ఏదన్నా సమాచారం నిజంగానే ఉందేమో అన్న అనుమానం కొంత అయినా కలగకపోదు కదా. వెంటనే దానికి విరుగుడుగా కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు సంజయ్ బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కానుందని, అక్కడ ఎవరెవరికి ఏ పదవులు లభించనున్నాయో చెప్పారు. ఇది మొత్తానికి విషయాన్ని తేలిక చేసినా ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రెండు జాతీయ పార్టీలూ బిఆర్‌ఎస్‌ను ఒక ఆట ఆడుకుంటున్నాయన్నది మాత్రం వాస్తవం.

భారత రాష్ట్ర సమితి నిజంగానే బలహీనపడిపోయిందా, లేకపోతే ప్రధాన జాతీయ పార్టీలు రెండూ మైండ్ గేమ్ ఆడుతున్నాయా అన్న సందేహం కూడా కలగకపోదు కొందరిలో. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే స్వతంత్రంగా బిజెపి బలం గత లోక్‌సభలో లాగా లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన ప రిస్థితి. అందునా అస్సలే నమ్మదగని, నమ్మకూడని చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌ల మీద ప్రధానంగా ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ విమర్శ ఆ ఇద్దరి మీద ఎందుకు ఉం దంటే వాళ్ళు ఎన్‌డిఎతో ఎన్నిసార్లు వియ్యం, ఎన్నిసార్లు క య్యం పెట్టుకున్నారో ప్రపంచానికి తెలుసు కాబట్టి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి అత్యంత ఉత్సాహజనకమైన ఫలితాలు సాధించి కేంద్రంలో బలమైన కూటమి గా అవతరించింది. తెలంగాణలో అధికారాన్ని కూడా సాధించుకున్నది. 2019 ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లో మొన్న కూడా పునరావృతం అయి ఉంటే తెలంగాణలో పరిస్థితులు ఇప్పటికే చాలా భిన్నంగా ఉండేవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బిజెపి ముఖ్యంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా జోడీకి ప్రాంతీ య పార్టీల ఉనికే నచ్చదు, వాటి అస్తిత్వం వారికి గిట్టదు అన్న ప్రచారం బలంగా ఉన్నది. ఆ ప్రచారానికి ఊతం ఇచ్చే ఘటనలు కూడా కొన్ని జరిగాయి ఈ పదేళ్ళ కాలంలో. ఇటువంటి పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితి సహజంగానే అస్తిత్వం కోసం పోరాటం చేస్తుందా చేతులెత్తేసి ఏదో ఒక జాతీయ పార్టీలో చెరిపోతుందా అన్నది చర్చ.

దాదాపు ఆరు మాసాలుగా మద్యం కుంభకోణంలో నిందితురాలిగా బిఆర్‌ఎస్ నాయకురాలు కవిత తీహార్ జైల్‌లో ఉన్నా రు. ఆమెను బయటకు తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీని బిజెపిలో విలీనం చేయడానికైనా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సిద్ధంగా ఉన్నారని ప్రచారం తీవ్రంగా జరుగుతున్నది. మరో పక్క ఇప్పటికే 10 మంది శాసన సభ్యులు కాంగ్రెస్‌కు వలసపోయారు. ఇంకా కొందరు కూడా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి . ఈ స్థితిలో బిఆర్‌ఎస్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటికింకా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరుపుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది . త్వరలో జరగబోయే ఒక ఆసక్తికర పరిణామం కోసమే ఈ జాప్యం అనే ప్రచారం బాగా ఉంది . ఇక కాంగ్రెస్ రేపో మాపో రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకునే కసరత్తు ఢిల్లీ లో జరుగుతున్నది. ముందే చెప్పుకున్నట్టు జాతీయ పార్టీలకు ఎవరు అధ్యక్షులుగా ఉన్నా, ఎవరు ముఖ్య మంత్రులుగా ఉ న్నా అధిష్టానం చెప్పినట్టు నడుచుకోవాల్సిందే కాబట్టి పెద్ద తేడా ఏమీ ఉండదు.
ఇదిలా ఉంటే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో తన పార్టీ తెలుగు దేశంను బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. నిన్న శనివారం నాడు ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి తెలంగాణలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారని సోషల్ మీడియా కోడై కూసింది.

ఆయన కూడా బిఆర్‌ఎస్ కన్నా చాలా ముందే తనది జాతీయ పార్టీ అని, తాను ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిననీ, తన కుమారుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి అని ప్రకటించుకున్నారు. అయితే ఆయన తెలంగాణ వదిలిపెట్టి 2015లో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయాక తెలంగాణలో పార్టీ దాదాపుగా మూతపడింది. పరిస్థితులూ బాగా మారా యి. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బలంగా తలపడే క్రమంలో తెలంగాణ అస్తిత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ బిఆర్‌ఎస్ ఏ ఉనికి కోసం పోరాడుతుంటే చంద్రబాబు వచ్చి ఏం చేస్తారు అన్నది ప్రశ్న. తెలంగాణలో ఆయన గతం లో పొత్తు పెట్టుకొని పార్టీ ఏ లేదు. 2004 దాకా బిజెపితో, 2009 లో అప్పటి టిఆర్‌ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలతో, 2014 లో పరోక్షంగా, 2018 లో ప్రత్యక్షంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు ఆయన. అన్నీ విఫలయత్నాలే కాకుండా తెలుగు దేశంతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీలన్నీ అప్పట్లో తీవ్రంగా నష్టపోయాయి. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన మళ్ళీ తెలంగాణలో చక్రం తిప్పుతానని చంద్రబాబు అనుకుంటే అది భ్రమ. గతంలో ఆయన తెలంగాణలో నియమించిన పార్టీ అధ్యక్షులు వరుసగా అధికార పక్షానికి వలసపోయిన విషయం ఆయన మరిచిపోయి ఉండరు.

ఇప్పుడు జాతీయ ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో తన భాగస్వామి గా ఉన్న బిజెపికి తెలంగాణలో తోడుగా ఉందామని, సాయం చేద్దామని ఆయన ఆలోచిస్తున్నారా చూడాలి. ఆ సాయాన్ని అందుకోడానికి తెలంగాణలో బిజెపి శ్రేణులు సిద్ధంగా ఉన్నా యా, వాళ్ళకూ ఆయనతో గతానుభవాలు ఉన్నాయి కదా ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో తన పార్టీ అధ్యక్షుడి వేటలో ఉన్నారు. వెరసి తెలంగాణలో కాంగ్రె స్, బిజెపి, తెలుగుదేశం పార్టీలు అధ్యక్షుడి వేటలో ఉంటే శాశ్వత అధ్యక్షుడు ఉన్న బిఆర్‌ఎస్ ఆయన గైర్హాజరీతో గందరగోళంలో పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News