Wednesday, January 22, 2025

వివాదాల్లో మేఘా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేఘా కృ ష్ణారెడ్డి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. మేఘా కృష్ణారెడ్డి అంటే తెలుగు రాష్ట్రా ల్లో తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా బడా కాంట్రాక్టులు ఆయన కంపెనీలే చేస్తూంటాయి. తెలంగాణలో కాళేశ్వరం వంటి పె ద్ద ప్రాజెక్టుకు మేఘా ఇంజినీరింగే కాంట్రాక్టర్. కాంట్రాక్టులతో పాటు ఎన్నో వ్యాపారాలు ఉన్న మే ఘా కృష్ణారెడ్డి ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు.. కానీ ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. తెలంగాణలో బిఆర్‌ఎస్ పదేళ్ల పా టు అధికారంలో ఉంది. మేఘా ఇంజినీరింగ్ కం పెనీ ఎన్నో కాంట్రాక్టులు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో సింహ భాగం మేఘా కంపెనీనే చేసిం ది. ఇతర ప్రాజెక్టులు కూడా ఆ సంస్థకే దక్కాయి. బాగా పని చేస్తున్నారని గతంలో అప్పటి సిఎం కెసిఆర్ సన్మానం కూడా చేశారు. అందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కాంగ్రెస్ నేతలు మేఘా కృష్ణారెడ్డిపై అనేక విమర్శలు చేశారు. మే ఘా కంపెనీకి తెలంగాణను దోచి పెడుతున్నారని, ఆంధ్రా కాంట్రాక్టర్‌కు దాసోహం అయ్యారని ఆరోపించారు. మేఘాను ఈస్టిండియా కంపెనీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన కంపెనీపై ఇప్పుడు బిఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కాంట్రాక్టులు కట్టబెడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కా బట్టి మేఘా కృష్ణారెడ్డి కూడా ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకవేళ బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పార్టీతో తనకు గతంలో ఉన్న సంబంధాలు మరింత బలపడేవి అని, బిఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేసేవారు కాదు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర రాజకీయాలకు మేఘా కృష్ణారెడ్డి కేంద్రం బిందువుగా మారుతున్నారు.

అరెస్ట్ చేసే దమ్ముందా?
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అరెస్ట్ కోసం ఉవ్విళ్లూరుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిశాల ఘటనలో తనను టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవి..?’ అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. తన అరెస్ట్ కోసం సిఎం వేచి చూస్తున్నారని, కానీ, సుంకిశాల ఘటనలో మేఘా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్ చేయడానికి ప్రభుత్వానికి దమ్ముందా..? అని ప్రశ్నించారు. మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి దమ్ముందా..? ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ని తన ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసేయడానికి దమ్ముందా..? ..లేదా..? చెప్పాలటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ ముఖ్యమంత్రి అయి ఉండి ‘మేఘా’కు గులాంగిరీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

అరెస్టులను ఖండించిన కెటిఆర్

ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైన, హామీల అమలు వైఫల్యం పైన నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నిర్బంధంలోకి తీసుకున్న తమ పార్టీ నేతలు, మాజీ ఎంఎల్‌ఎలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డిలను, నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాలిన కడుపులెక్కడ -సిఎం తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ..?
మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉంది గుంపు మేస్త్రీ పాలన తీరు అంటూ కెటిఆర్ సెటైర్ వేశారు. హైదరాబాద్‌లో మూసీ బాధితులు ఉంటే- నల్గొండలో మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి..? అని అడిగారు. కూల్చిన ఇండ్లెక్కడ.. కాలిన కడుపులెక్కడ -సిఎం తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆగిన గుండెలెక్కడ..- రగిలిన మనసులెక్కడ .. సిఎం చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ… చేస్తున్న పాదయాత్ర ఎక్కడ..? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి కుట్రలకు అంబర్‌పేట్ ,అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే ఆయన -పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ..? అని అడిగారు. సీఎం మూసీ దాహానికి అత్తాపూర్ ఆగమైంది..-గోల్నాక గొల్లుమంటుంది..-దిలుషుక్‌నగర్ ఢీలా పడ్డదని పేర్కొన్నారు.

అయ్యా సంబరాల రాంబాబు..-నీ అన్యాయానికి..అవేదనలు,ఆవేశాలు,అక్రందనాలు వినిపిస్తున్నవి కనిపిస్తున్నవి అక్కడ కాదు.. రా ఇటు వైపు రా..ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తేలు మంత్రం రానోడు .. పాము కాటుకు మంత్రం ఏసినట్లు .. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్ ..నాయకత్వం అంటే కూల్చడం కాదు .. నిర్మించడం, నాయకత్వం అంటే తొవ్వ తప్పడం కాదు .. తొవ్వ చూపడం అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News