Monday, December 23, 2024

తెలంగాణ పోల్స్ 2023: అక్కడా.. ఇక్కడా వారే…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సాధారణంగా కొన్ని సినిమాల్లో ఒక పాటలో కనిపించిన డ్యాన్సర్లే… మరో పాటలో కనిపిస్తుంటారు.. కాస్టూమ్స్ మాత్రమే.. తేడా. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తున్న కార్యకర్తలు (అద్దెప్రాతిపదికన) మధ్యాహ్నం మరో పార్టీ తరపున, సాయంత్రం మరో పార్టీ తరపున ప్రచారం చేస్తున్న సంఘటలను చోటు చేసుకుంటున్నాయి. వీరిలో అత్యధికంగా అడ్డా కూలీలు, ఇళ్ళల్లో పని చేసే వర్కర్లే అధికంగా ఉండటం విశేషం. వీరికి ఆయా పార్టీల తరపున ప్రచారం చేసిందుకుగాను రూ.300 నుంచి 500 వరకు ఆయాపార్టీల నిర్వాహకులు చెల్లిస్తున్నట్లు సమాచారం. పలు పార్టీల తరపున ప్రచారం చేస్తునందుకుగాను వారు రోజుకు ఎంత లేదన్నా రూ.1500 నుంచి 2000 వరకు సంపాదిస్తున్నారు.

అయితే ఇందుకు కొన్ని ఏజెన్సీలు ప్రత్యేకంగా పని చేస్తున్నట్లు తెలిసింది. సదరు ఏజెన్సీలు అడ్డాకూలీల వద్దకు వెళ్ళి ముందుగానే వారితో ఒప్పందం చేసుకుంటున్నాయి. ప్రతి రోజు ఉదయం పనికి వెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకునే బదులు కేవలం సదరు పార్టీల జెండాలు మోసినందుకే ఇంత మొత్తంలో సంపాధిస్తుండటంతో వారు పార్టీల తరపున ప్రచారం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

అదే విధంగా నివాసాల్లో పని చేసే వర్కర్లు కూడా త్వర త్వరగా వారి విధులను ముగించుకుని పార్టీల తరపున ప్రచారం చేసేందుకు వెళుతున్నారు. కొన్ని ఇళ్ళల్లో పనిచేసేందుకు ఆలస్యంగా రావడంతో సదరు గృహ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. ఈ ఎన్నికల ప్రచారాల్లోనే కదా అమ్మా నాలుగు రాళ్ళు సంపాదించుకునేదని సర్థిచెబుతుండటంతో చేసేది ఏమీ లేక సదరు గృహ యజమానుల మౌనంగా తమ అంగీకారం తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News