(డిఎస్.సుభాష్‌కృష్ణ/మనతెలంగాణ)
ఎన్నికల గడువు సమీపించడంతో గోషామహల్ సెగ్మెంట్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీ లైన బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో సహా ప్రజా ఏక్తా పార్టీ, ధర్మ సమాజ్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల బరిలో తలపడు తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం గోషామహల్ ఇంచార్జి నందకిశోర్ వ్యాస్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా అలవోక గా గెలిచిన రాజాసింగ్‌కు ఈ సారి ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించక తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియో జకవర్గాని కి చెందిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావును ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు చేసింది. స్థానికేతరులకు పార్టీ టెకెట్ కేటాయింపు పట్ల స్థానిక నేతలు కినుక వహించి, ఆమెకు సహకరించక పోవడంతో పాటు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. గోషామహల్ నియోజ కవర్గం కొత్త కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారావు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2009లో దివంగత మాజీ మ ంత్రి ఎం ముఖేష్‌గౌడ్ గోషామహల్ నుండి విజయాన్ని సాధించి, రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు.
అనంతరం 2014 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో రాజాసింగ్ వరుసగా రెండోసారి విజయం సాధించి, ఈ నెల 30న మూడోసారి జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతు న్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించడంతో ఇప్పటి వరకు గోషామహల్‌లో బోణీ కొట్టలేకపోయింది, అయితే ఈసారి ఎలాగైలా గోషామహల్‌ను కైవసం చేసుకుని బోణీ కొట్టాలన్న యోచనతో బీఆర్‌ఎస్ అధిష్టానం బలమైన అభ్యర్ధిని రంగంలోకి దింపేందుకు తొలి జాబితాలో గోషామహల్ అభ్యర్థిని ప్రకటించలేదు. బలమైన అభ్యర్థి కోసం అంతర్గత సర్వే నిర్వహించిన బీఆ ర్‌ఎస్ అధిష్టానం స్థానికంగా ఉంటూ గత 25 ఏళ్లుగా ప్రజలతో సత్సంబంధాలు గల నందకిశోర్‌వ్యాస్ పేరును చివరి క్షణంలో ఖరారు చేసింది, దీంతో గోషామహల్ రాజకీయం రసవత్తరంగా మారింది, అన్ని పార్టీల్లో రాజకీయ సమీకరణలు మారనున్నట్టు తెలుస్తోంది, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అసంతృప్త నేతలను బుజ్జగించడంతో పాటు వారు పార్టీ నుంచి జారిపోకుండా కాపాడుకోవడంపై ఫోకస్ చేశారు.
ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్‌ఎస్
గోషామహల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. మొన్నటి వరకు అసంతృప్త నేతల బుజ్జగింపులు, కుల సంఘాలతో చర్చలు జరిపి, రాజకీయ సమీకరణలు చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్ధి నందకిశోర్ వ్యాస్ గురువారం నుండి ఎన్నికల ప్రరారానికి శ్రీకారం చుట్టారు. ఉదయం నుండి సాయ ంత్రం వరకు నిరంతరాయంగా గడప గడపకు వెళ్లి సిఎం కెసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పళకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూకుడు పెంచి, పార్టీ క్యాడర్‌లో జోష్ పెంచారు.
బిజెపి విస్తృత ప్రచారం
ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముందు వరుసలో దూసుకుపోతోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌ను సుమారు ఏడాది పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు సస్పెన్షన్‌ను తొలగించి, గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ పేరు ఖరారు చేసింది, దీ ంతో రెట్టించిన ఉత్సాహంతో రాజాసింగ్ ఇప్పటికే పాదయాత్రల ద్వారా గోషామహల్ నియోజకవర్గాన్ని చుట్టేశారు.
పుంజుకుంటున్న కాంగ్రెస్ ప్రచారం
గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్ధి సునీతారావు ఎన్నికల ప్రచారంలో కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ క్రమేపీ పుంజుకుంటున్నారు, సునీతారావు స్థానికురాలు కాకపోవడంతో మొదట్లో ప్రచారంలో కాస్త వెనుకబడినా, స్థానిక ముఖ్య నేతలను కలిసి బుజ్జగిస్తుండటం, పార్టీ గెలుపు కోసం అందరూ సమిష్టిగా పని చేయాలని పార్టీ అధిష్టానం నుండి ఆదేశాలు రావడంతో అలక వీడిన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా సునీతారావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొ ంటుండటంతో కొద్ది రోజులుగా నిస్తేజంగా ఉన్న క్యాడర్‌లో కొత్త ఉత్తేజాన్నిచ్చింది. ఎన్నికల ప్రచారంలో పుంజుకుని, బీజేపీ, బీఆర్‌ఎస్‌లతో పోటీ పడు తోంది.
బిఆర్‌ఎస్, బిజెపి మధ్యే ప్రధాన పోటీ…
సార్వత్రిక ఎన్నికల్లో గోషామహల్ నుండి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు బీఆర్‌ఎస్ పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే కొనసాగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు అసంతృప్తుల బెడద కూడా అధికంగానే ఉంది. పార్టీ అధిష్టానం ఆదేశాలు, హామీలతో ఎంతవరకు ఆయా పార్టీలు సఫలం అవుతాయో మరో రెం డు మూడ్రోజుల్లో తేలిపోనుంది. గోషామహల్ నియోజకవర్గంలో నూతన ఓటర్ల చేరికతో మొత్తం 2 లక్షల 70 వేలపై చిలుకు ఓట్లు ఉండగా, వీటిలో 70వేల వరకు ముస్లిం ఓటర్లు, 12వేల క్రైస్తవ ఓటర్లు, 35వేల ఎస్సీ ఓటర్లు ఉండగా, 35 వేల బీసీ ఓటర్లుండగా, దాదాపు లక్షకు పైగా ఓట్లు సెటిలర్ల వే కావడం గమనార్హం. నియోజకవర్గంలో మిగతా బీసీ వర్గాలు ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన గోషామహల్ ఓటర్లు ఇప్పటి వరకు జరిగిన ఎన్నిక ల్లో కాంగ్రెస్, బీజేపీలకే పట్టం కడుతూ వస్తున్నారు.