Thursday, January 23, 2025

విద్యుత్ సరఫరాలకు యుద్దప్రాతిపదిక చర్యలు చేపడుతున్నాం

- Advertisement -
- Advertisement -

విద్యుత్ సరఫరాలకు యుద్దప్రాతిపదిక చర్యలు చేపడుతున్నాం
ఎన్‌పిడిసిఎల్ సీఎండి గోపాలరావు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ పరిధిలోని 17 జిల్లాలో అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించ దానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని సంస్థ ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు తెలిపారు. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అంతరాయం కలిగిన సాధ్య మైనంతవరకు సరఫరా ఇవ్వడానికి లోడ్ మానిటరింగ్ సత్వర చర్యలు తీసుకోవడానికి 16 సర్కిళ్ళ సూపరింటెండింగ్ ఇంజనీర్లతో మాట్లాడి సరఫరా త్వరగా అందించేటట్లు చర్యలు చేపట్టామన్నారు. దాదాపు 20 పబ్ స్టేషన్లలో వీళ్ళు వచ్చి చేరాయని, 33 కెవి ఫీడర్లు 46 బ్రేక్ డౌన్ అవ్వగా అందులో 38 సరిదిద్దామని తెలిపారు. కొన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగిందని, 1208 పోళ్ళు. 62 డిటిఆర్లు దెబ్బతిన్నాయని వాటిని వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.

మిగిలిన గ్రామాల్లో వర్షాలు తగ్గు ముఖం పట్టగానే విద్యుత్ సరఫరా అందిస్తామని తెలిపారు. కరెంట్ లేని గ్రామాల్లో కూడా విద్యుత్ సిబ్బంది అహర్నిశలు కష్టపడి సరఫరా అందించ డానికి కృషి చేస్తున్నారన్నారు.హన్మకొండ, వరంగల్, ములుగు మరియు భూపాలపల్లి జిల్లాలో. అతి భారీ వర్షాలు కురవటం వలన చాలా లైన్లు, డిటిఆర్లు మరియు పబ్ స్టేషన్లు మునిగిపోయాయని,. విద్యుత్ నెట్వర్క్ అంతా నీటిలో మునిగిపోవటంతో నష్టం వివరాలు అంచనా వేయలేక పోతున్నామని తెలిపారు.

వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి:

వరుస వర్షాలతో విద్యుత్ వ్యవస్థ పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సీఎండి గోపాలరావు విజ్ఞప్తి చేశారు.మీ పరిధిలో చెట్లు విరిగి లైన్లు తెగిపడిన వెంటనే మా సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ఎట్టిపరిస్థితిలో విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని,ఇంట్లో విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, తడి చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవద్దన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలకై టోల్ ఫ్రీ నెంబరు, 1800 425 0028 కు లేదా 1912 కు సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News