- Advertisement -
గాంధీనగర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత నెలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు కనకంబట్ల వెంకటేశ్వర శర్మ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ అడిక్‌మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఇఒ శ్రీనివాస్, పాన్‌బజార్ వేణుగోపాలస్వామి దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ రమణ అక్కడికక్కడే చనిపోయారు. వెంకటేశ్వర శర్మ మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వెంకటేశ్వర శర్మ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని అల్లోల పేర్కొన్నారు.
- Advertisement -