Thursday, January 23, 2025

ఇప్పుడు తెలంగాణ ప్రగతి పరుగులు తీస్తుంది: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే ప్రగతి పరుగులు తీస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి లతో కలిసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం లో రూ.28 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రూ.13 కోట్ల అంచనా వ్యయంతో మొయినాబాద్ మండ‌లం బాకారం పిడ‌బ్ల్యుడి రోడ్డు నుంచి అజీజ్ న‌గ‌ర్ ఎస్సీ కాల‌నీ మీదుగా నాగిరెడ్డిగూడ వ‌ర‌కు బిటి డ‌బుల్ రోడ్డుకు శంకుస్థాప‌న చేశారు. రూ.5 కోట్ల అంచనా వ్యయంతో శంకర్ పల్లి మండలం మహారాజు పేట నుండి చిన్న మంగళారం రోడ్డు పై బ్రిడ్జి నిర్మాణం, రూ.5కోట్ల అంచనా వ్యయం తో హైదరాబాద్ నుండి వ‌యా తోల్‌క‌ట్టా న‌క్క‌ల‌ప‌ల్లి వెళ్ళేదారిలో హై లేవెల్ బ్రిడ్జికి శంకుస్థాప‌న, రూ.5 కోట్ల అంచనా వ్యయంతో తిమ్మారెడ్డి గూడ నుంచి ప‌మెన దారిలో తిమ్మారెడ్డి గూడ వ‌ద్ద హై లెవ‌ల్ బ్రిడ్జికి శంకుస్థాప‌న చేశారు.

ఈ సందర్బంగా ఎర్రబెల్లి మాట్లాడారు. దేశానికే ఆదర్శంగా మన రాష్ట్రంలోని గ్రామాలు ఉన్నాయని, సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ పడుతుందని, అద్దంలా గ్రామాల్లో సిసి రోడ్లు… గ్రామాలను కలుపుతూ రోడ్లు వేస్తున్నారని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ మార్గదర్శనం కోసం దేశం వేచి చూస్తుందన్నారు. ఇంతగా అభివృద్ధి చేస్తున్న బి అర్ ఎస్ పార్టీకి, సిఎం కెసిఆర్ కు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ జడ్ పిటిసి కాలే శ్రీకాంత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News