Thursday, January 23, 2025

తెలంగాణ ప్రాజెక్ట్ 2వ యూనిట్ స్టీమ్ బ్లోయింగ్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌కు చెందిన రెండవ 800 మెగవాట్ల విద్యుత్ యూనిట్ నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు చేపట్టిన స్టీమ్ బ్లోయింగ్ విజయవంతంగా కొనసాగింది. గత 45 రోజుల ననుంచి రెండవ విద్యుత్ యూనిట్ నుంచి 63 సార్లు స్టీ మ్ బ్లోయింగ్‌ను చేపట్టి విజయవంతం చేసి, యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిపేందుకు సిద్ధం చేస్తున్నారు.

రామగుండం ఎన్టీపీసీ వద్ద 800 మెగవాట్లకు చెందిన రెండు విద్యుత్ యూనిట్ల నిర్మాణం పనులు చేపట్టారు. ఒకటవ ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ యూనిట్‌ను ఇప్పటికే స్టీమ్ బ్లోయింగ్‌తోపాటు పలు టెస్ట్‌లు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2వ 800 మెగావాట్ల యూనిట్‌లో కూడా స్టీమ్ బ్లోయింగ్‌తోపాటు అనేక రకాల టెస్ట్‌లు నిర్వహించి, మరో 20 రోజుల్లో సింక్రనైజేషన్ చేసేందుకు సిద్ధంచేస్తున్నారు.

రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ నుంచి 4వేల మెగవాట్ల విద్యుత్ తెలంగాణకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే రామగుండం ఎన్టీపీసీ వద్ద మొదటి దశలో 800కు చెందిన రెండు విద్యుత్ యూనిట్ల నిర్మాణం చేపట్టారు. మరో నెల రోజుల్లో రెండు విద్యుత్ యూనిట్ల నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News