Monday, December 23, 2024

తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానం

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ ఉందని, ఆ ఘనత సిం కెసిఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక జిఎంఆర్ ఫంక్షన్ హాలులో విద్యుత్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విభజన సమయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శమలను తిప్పి కొట్టే విదంగా విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందిచిన గణత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు.

మూడు వారాల పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో తొమ్మిదేళ్ళ రాష్ట్ర ప్రగతిని సిఎం కెసిఆర్ సూచన మేరకు రాష్ట్ర ప్రజలకు తెలియజేయనున్నట్టుగా చెప్పారు.సిఎం కెసిఆర్ దూరదృష్టే విద్యుత్ కోతల నుంచి విముక్తి కలిగిందన్నారు. పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో వారంకు మూడు రోజులు పవర్ సెలవు ప్రకటించే వారని దాంతో పారిశ్రమ వేత్తలు చాలా నష్టాలకు గురైయ్యారన్నారు. పరిశ్రమలపై ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డదన్నారు. ఎంతో మంది కార్మికులు వలసల బాట పట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలపాటు అందించడంతో మూడు షిప్టుల్లో పరిశ్రమలు పనిచేస్తున్నాయన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలియగానే బడా పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి భారి పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకువస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగానికి, గృహలకు కోతలు లేని విద్యుత్‌ను అందిస్తున్న గణత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 3 సబ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.45 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రభాకర్, సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, పాండు రంగా రెడ్డి, మెట్టు కుమార్, పుష్ప నగేశ్, సింధు ఆదర్సరెడ్డి, కుమార్ గౌడ్, విజయ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి అధికారులు బీంరెడ్డి, శ్రీనివాస్ రావు, రమేశ్ చంద్ర,దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News