Thursday, January 23, 2025

సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నాయని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు 10వ రోజుకు చేరాయన్నారు. పల్లె ప్రగతి నివేదిక యాత్రలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగి తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, ప్రగతి నివేదికను ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు.

జులై మాసం నుంచి ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కుల వృత్తులకు ఆర్థిక సాయం కింద రూ. 100 కోట్లు కేటాయించిందని, అర్హులైన ప్రతీ ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందచేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరిగిన అభివృద్ధి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో స్టేషన్ ఘన్‌పూర్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. పల్లె ప్రగతి నివేదన యాత్రకు అందరి సహకారం కావాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మాచర్ల గణేస్‌గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుజ్జరి రాజు, నాయకులు తాటికొండ సురేష్‌కుమార్, చల్లా చందర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News