Monday, December 23, 2024

కెసిఆర్ నాయకత్వంలో దేశంలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2022-23 సంవత్సరానికి తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి కె.టి.రామారావు తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో రూ.1.24 లక్షల నుంచి 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు గణనీయంగా పెరిగిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.

తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం 155 శాతం వృద్ధిని సాధించడం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికమని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధి దిశగా నడిపిస్తూ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీర్చిదిద్దుతున్నారని ఆయన తన ట్వీట్‌లో కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News