Monday, December 23, 2024

సూర్యాపేటలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సావాలలో బాగంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ దినోత్సవ సంబురాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఈ కార్యాక్రమనికి అధ్యక్షత వహించారు.

మంత్రి జగదీష్ రెడ్డి జ్యోతిని వెలిగించి మహిళా సంక్షేమ దినోత్సవం సంబురాలు ప్రారంభించారు. ఈ కార్యక్రంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,పెన్పహాడ్ జడ్ పిటిసి మామిడి అనిత, చివ్వేంల యంపిపి ధరవత్ కుమారి, ఆత్మకూరు తహసీల్దార్ పుష్ప, మున్సిపల్ కొన్సిలర్స్ ఆకుల కవిత, మాలోతు కమల, కుంభం రేణుక, జాటోతు లక్ష్మీ, నిమ్మల స్రవంతి, కొండపల్లి భద్రమ్మ, ధరవత్ నీలాబాయి, బత్తుల లక్ష్మీ, జ్యోతి శ్రీవిద్య, జిల్లా సంక్షేమ శాఖాధికారిణి జ్యోతిపద్మ, ఎస్ సి కార్పొరేషన్ ఈడి శిరీష, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News