Saturday, November 9, 2024

రేషన్ డీలర్లకు తీపి కబురు

- Advertisement -
- Advertisement -

టన్నుకు కమీషన్ రూ.1400కు పెంపు

కరోనా కాలంలో చనిపోయిన 100మంది వారసులకు షాపుల కేటాయింపు డీలర్లకు
రూ.5లక్షల బీమా 17వేల మందికి పైగా లబ్ధి ప్రభుత్వంపై రూ.139కోట్ల అదనపు
భారం రేషన్ డీలర్ల సంఘాలతో మంత్రులు హరీశ్, గంగుల చర్చలు సఫలం 13
ప్రధాన డిమాండ్లకు పరిష్కారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన డీలర్లు

మన తెలంగాణ/ హైదరాబాద్: బిఆర్‌ఎస్ సర్కారు రేషన్ డీ లర్లకు తియ్యటి కబురు అందించింది. రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న రేషన్ సరుకులపై ప్రభుత్వం అందజేస్తున్న కమీషన్‌ను టన్నుకు రూ.1400కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలం గా ఎదురు చూస్తున్న వేలాది మంది రేషన్ డీలర్ల కలను ప్రభుత్వం నెరవేర్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశంతో రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, బిసి సంక్షేమ, పౌర రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన చర్చలు సఫలమయ్యా యి.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంఎల్‌ఎ పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జె ఎసి నేతల సమక్షంలో జరిపిన సమావేశంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ దేశాల మేరకు మెట్రిక్ టన్నుకు ప్రస్తుతం ఉన్న రూ.900 కమిషన్‌ను రూ.1400కు పెంచుతున్నట్టు మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227మంది రేషన్ డీలర్లకు లబ్ధ్ది చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ. 139 కోట్ల అదనపు భారం పడుతుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని అన్నివర్గాల్లోని ప్రతీ ఒక్కరి సంక్షేమాన్ని చూస్తున్నారని, రేషన్ డీలర్లను సైతం ఆదుకోవాలని ఆదేశించారని మంత్రులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ కేవలం మెట్రిక్ టన్నుకు రూ.200 మాత్రమే ఉండేదని గుర్తుచేశారు.

అతి తక్కువ సమయంలో 700 శాతం కమీషన్ పెంచిన ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు. దేశంలోని ఏ కేంద్ర ప్రభుత్వ కోటాకు అదనంగా ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 90.05 లక్షల రేషన్ కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున రేషన్ అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అదనంగా కిలోను కేటాయిస్తున్నామన్నారు. కమీషన్ సైతం కేంద్రం పెంచుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే పెంచి అందిస్తున్నామని వెల్లడించారు. ఏకమొత్తంగా రెండు రెట్లు కమీషన్ పెంచడమే కాకుండా రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను ఈ సమావేశంలో ద్వారా మంత్రులు పరిష్కరించారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్‌షిప్‌లను మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడ తదితర బీమాల తరహాలో రేషన్ డీలర్లకు 5లక్షల బీమా అమలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రతీ డీలర్‌ను తీసుకురావడం, ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్‌షిప్ రెన్యూవల్‌ను 5 ఏళ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్ డీలర్‌షిప్ వయోపరిమితిని 40 నుంచి 50 ఏళ్లకు పెంపుదల, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం కింద రూ. 10 వేలు చెల్లింపు , 1.5 క్వింటాళ్ల వేరియేషన్‌ను కేసుల పరిధి నుంచి తీసివేయడం, హైదరాబాద్‌లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై ఈ సమావేశంలో మంత్రులు ప్రభుత్వం తరఫున సానుకూలత వ్యక్తం చేశారు.

సిఎంకు ధన్యవాదాలు తెలిపిన డీలర్ల సంఘం నేతలు:

డీలర్ల కమీషన్ పెంపు సహా తమ ఇతర సమస్యల పరిష్కరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కి రేషన్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ కడుపునిండా అన్నం పెట్టేలా కృషి చేసిన మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్‌లకు , డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్ రెడ్డిలకు డీలర్ల సంఘం నేతలు సమావేశంలోనే ధన్యవాదాలు తెలిపారు. చర్చల కార్యక్రమంలో మంత్రులతో పాటు సివిల్ సప్లయిస్ కమిషనర్ వి.అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జెఎసి ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లికార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News