Saturday, November 16, 2024

ఎల్‌ఆర్‌ఎస్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మంగళవారం 500మందితో బిఆర్‌ఆర్‌కె భవన్‌ను ముట్టడించనున్నట్టు తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ హెచ్చరించింది. గ్రామ పంచాయతీ పరిధిలోని లే అవుట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయక పోవడంపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్టు అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం 26 లక్షల మంది ఎదురు చూస్తున్నారని తక్షణమే వాటి క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన కోర్టు కేసు నడుస్తోంది. అంతలోపు దరఖాస్తులను స్క్రూటీని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana Realtor Association warning to TS Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News