Saturday, November 16, 2024

తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణ చరిత్రలో అత్యంత రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ములుగు జిల్లా వాజేడులో ఈనెల 19 తరవాత మళ్లీ గడచిన 24 గంటలలో 51.5 సెం.మీల వర్షం పడింది. గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీల వర్షం పడింది.

గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన వర్షపాతం నమోదు కాగా, 200ల కేంద్రాల్లో 10 సెం.మీల పైగా వర్షం పడింది.రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో 45 సెం.మీల వర్షపాతం నమోదైంది. నిన్న(బుధవారం) నుంచి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే హెలికాప్టర్లను కూడా తరలించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News