Monday, January 27, 2025

అన్ని రంగాల్లో తిరోగమనం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పదేళ్ల పాటు కెసిఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ.. అనుభవరాహిత్యం, అసమర్ధత, అవినీతి కలగలసిన రేవంత్ రెడ్డి పాలనలో నేడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ అని, ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయని చెప్పారు. కానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తిరోగమనంలో ఉందని అన్నారు.

మన పొరుగున ఉన్న అయిదు రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 శాతం నుండి 32 శాతం వృద్ధిని నమోదు చేస్తే తెలంగాణ ఒక్కటే గత ఏడాది కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడం రాష్ట్రంలోని విఫల ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. పాలన గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయిస్తే ఫలితాలు ఇలా కాక మరెలా ఉంటాయని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి లాగే అందరూ జైలుకెళ్లాలని అనుకుంటున్నారేమో  బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన తర్వాత, అందరూ అదే అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందని అనిపిస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పైన, తమ కంపెనీ కార్యకలాపాల పైన ఆ పథకం యొక్క ప్రభావాన్ని వ్యక్తపరిచినందుకు ఎల్ అండ్ టి వంటి ప్రముఖ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ని జైలుకు పంపిస్తాను అంటూ ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు అని విమర్శించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులను జైలుకు పంపిస్తానంటూ రేవంత్ బెదిరింపులకు పాల్పడడం సరైనది కాదు అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు దిగజారుతున్న ఆయన మానసిక స్థితికి అర్ధం పడుతున్నాయని అన్నారు. ఇలాంటి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో రేవంత్ పరిశ్రమలకు ఏ సందేశం పంపుతున్నాడని ప్రశ్నించారు. ఇదేనా రాహుల్ గాంధీ దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ పార్టీ ముఖ్యమంత్రులకు నేర్పించిన గొప్ప వ్యూహం అంటూ కెటిఆర్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News