Thursday, January 23, 2025

రాష్ట్రంలో కొవిడ్ ప్రతాపం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ ఉద్ధృతి
ఒక్కరోజులో 1052 కరోనా, 10 ఒమిక్రాన్ కేసులు
అత్యధికంగా జిహెచ్‌ఎంసి పరిధిలో 659
ఆరు నెలల అనంతరం పెరిగిన కరోనా కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ ః రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,991 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది.. అలాగే ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో గత ఆరునెలలుగా తక్కువ సంఖ్యలో నమోదైన కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. తాజాగా జిహెచ్‌ఎంసి పరిధిలోనే 659, రంగారెడ్డిలో 109 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 116 కేసులు నమోదైయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,84,023కి చేరింది. ఇక గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4,033కి చేరింది. కరోనా బారి నుంచి సోమవారం 240 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 ఐసోలేషన్, యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 42,991 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1052 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,84023కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంటే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వారం కింద వరకు రెండొందలు దాటని కరోనా రోజువారీ కేసులు ఇప్పుడు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆరు నెలల తర్వాత మరోసారి వెయ్యికి పైగా కేసులు వెలుగుచూశాయని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒమిక్రాన్ 10 కేసులు ః
రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 94కి చేరింది. అలాగే 24గంటల వ్యవధిలో ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి 127మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి చేరకున్నారు. వారందరికీ కోవిడ్, ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేయగా 8మంది ప్రయాణీకులకు పాజిటివ్‌గా తేలింది. ఈక్రమంలో వారి నమూనాలను జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇప్పటి వరకు ఎట్ రిస్క్,నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 13,405 మంది ప్రయాణీకులకు ఆర్‌జిఐఎలో కరోనా,ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేశారు. వారిలో 189 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వారిలో 45 మందికి ఒమిక్రాన్ నెగెటివ్‌గా తేలింది. మిగిలిన 144 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్ బాధితుల్లో 378మంది కోలుకున్నారు. మరో 50 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.
కామారెడ్డిలో తొలి కేసు:
కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయింది. ఎల్లారెడ్డికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మూడు రోజుల క్రితం శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. చికిత్స కోసం బాధితున్ని హైదరాబాద్‌కు తరలించారు. ముందు జాగ్రత్ర చర్యగా గ్రామంలో శానిటైజేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

Telangana Report 1052 Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News