Monday, January 20, 2025

తెలంగాణలో మరో 12 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,322 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కటి చొప్పున నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా.. మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News