Monday, December 23, 2024

తెలంగాణలో కొత్తగా 385 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Report 385 new corona cases

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 39,386 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 385 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7.86లక్షలు దాటింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 733మంది కోలుకోగా, ఇప్పటివరకు 7.78లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 4,787 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.82 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.52 శాతంగా ఉంది.

Telangana Report 385 new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News