Monday, January 27, 2025

రాష్ట్రంలో 84కి చేరిన ఒమిక్రాన్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 84 Omicron Cases so far

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84కి చేరింది. ఇక, దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయానికి 1525కి చేరింది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర (460), ఢిల్లీ (351) తొలి రెండు స్థానాల్లో ఉండగా, గుజరాత్ (136), తమిళవాడు(117), కేరళ(109) కేసులతో కొనసాగుతున్నాయి. కొత్త వేరియంట్ నుంచి ఇప్పటివరకు 560 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Telangana Reports 84 Omicron Cases so far

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News