Saturday, November 23, 2024

తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించలేదు : టిటిడి

- Advertisement -
- Advertisement -

Tirumala Temple

తిరుపతి: తిరుమలలో సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేశారని టిటిడి అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గతంలో ఏ విధానం అమలు జరిగిందో… ఇప్పుడు కూడా అలాగే అమలు జరుగుతోందన్నారు. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని, గతవారం కొందరు ప్రజా ప్రతినిధులు వారి కోటాకు మించి లేఖలు ఇచ్చారని, విఐపి బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటం, ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు రావడంతో కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించడం జరిగిందని తెలియజేశారు. అయినప్పటికీ కొందరు ఫోన్ చేసి తమకు ముఖ్యమైన వారని చెప్పడంతో వారికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంజూరు చేసి స్వామివారి దర్శనం చేయించామని వివరించారు. అలాగే గదులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు వ్యక్తులు అవాస్తవ ఆరోపణలు చేయడం తగదని, ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని టిటిడి అధికారులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News