దేశానికే దిక్సూచిగా అవతరించిన తెలంగాణ
మన తెలంగాణ / హైదరాబాద్ : మైనారిటీల అ భ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రం దేశానికే దిక్సూచిలా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీల కోసం ప్రభుత్వం చేపట్టిన షాదీ ముబారక్, మైనారిటీ గురుకుల పాఠశాలలు సిఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం, ఇమా మ్, మౌజంలకు గౌరవ వేతనం, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ లాంటి అనేక కార్యక్రమాలు మైనారిటీల అభ్యున్నతికి మైలురాయిగా నిలిచాయి. షా దీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్రంలో 2 లక్షల 17వేల 565 మంది ఆడబిడ్డల పెళ్ళిళ్లకు రూ. 1751 కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. మైనారిటీ కుటుంబాలలో పు ట్టిన ఆడబిడ్డ ఎదుగుదల, విద్యాభివృద్ధికి, బాల్యవివాహాలను అరికట్టడానికి ఈ పథకం దోహదకారిగా నిలిచింది. పెళ్లి తల్లిదండ్రుల గుం డెల మీద కుంపటి కావద్దని ప్రభుత్వం విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది.
ఈ పథకం కింద యువతుల వివాహానికి ప్రభుత్వం లక్షా 116 రూ పాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కో సం ప్రభుత్వం రూ.300 కోట్లను కేటాయించింది. షాదీముబారక్ పథకం ద్వారా లబ్దిపొందిన ఆడబిడ్డల్లో అత్యధిక శాతం మంది కెసిఆర్ కిట్లను అం దుకోవడం విశేషం. విద్యపరంగా బెనుకబడిన మై నారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. నిరుపేద మైనారిటీల పిల్లల విద్యకు చేయూత నిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మై నారిటీ గురుకులాలను 12నుంచి 204కు పెంచిం ది. వీటిలో 50 శాతం గురుకులాలను మైనారిటీ బాలికల కోసం కేటాయించారు. గురుకులాల ద్వారా లక్షా 14 వేల మంది విద్యార్థులు లబ్దిపొందుతున్నారు.
సిఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఇప్పటివరకు రూ.6.30 కోట్ల ఆర్థిక సహాయాన్ని మైనారిటీ విద్యార్థులకు అందించడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లను ఈ పథకానికి కేటాయించారు. నాంపల్లిలోని అనాథ శరణాలయం అనీస్ ఉల్ గుర్బాను రూ.40 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నారు. మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే 10 వేల మంది ఇమామ్‌లు, మౌజం లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతోంది. రంజాన్ కానుకగా 4 లక్ష 65 వేల మందికి, క్రిస్టియన్ పండుగకు ఏటా సుమారు 5 లక్షల మందికి కొత్త బట్టలను కానుకగా ప్రభుత్వం అందిస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేస్తున్న గ్రూప్స్ పోస్టులకు జిల్లాల్లో ఉచిత శిక్షణ నివ్వడం జరుగుతోంది.