Monday, December 23, 2024

పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ రోల్ మోడల్

- Advertisement -
- Advertisement -

కుంటాల : దశాబ్దాలు తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన స్థానిక రైతువేదిక భవనంలో సుమారు 105 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల 60 ఏళ్ల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారన్నారు. తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చి రూపురేఖలు మార్చారని పేర్కొన్నారు. పంచా యతీలుగా గుర్తించడంతో పాటు వాటి అభివృద్ధ్దికి నిధులు కేటాయిం చారన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు, వంటి వాటివి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమయ్యే అని గుర్తు చేశారు. పోడు రైతులకు రైతుబీమా వర్తింప జేస్తామనడంతో లబ్ధ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని అనేక అద్భుత సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ గిరిజనులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. భూమి హక్కు పత్రాలు 70 ఏళ్ల కల సాకారం స్వరాష్ట్రంలో ఏర్పడిందని తెలిపారు. గత ప్రభుత్వాలు గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని కబ్జాలో ఉన్న పోడు పట్టాదారులకు సైతం పట్టాలువచ్చే విధంగా దశలవారీగా రాబోయే రోజుల్లో కృషిచేస్తామన్నారు. ఏ రాష్ట్రంలో లేని అద్బుతమైన సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పోటు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అప్క గజ్జారాం యాదవ్, జడ్పిటిసి గంగామణి బుచ్చన్న, స్థానిక సర్పంచ్ సమత వెంకటేష్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు ముజిగే ప్రవీణ్ కుమార్, సొసైటి చైర్మన్ సట్ల గజ్జారాం, బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంట ధశరత్‌థ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పవర్ బాపురావు, ఎండీ హైమద్, దాసరి కిషన్, ఖనీష్ ఫాతిమా, వైస్ ఎంపిపి మౌనిక, నవీన్ ఎంపిటిసిలు సుదాకర్, సునీత లక్ష్మీ, ఎంపిడివో దేవెంధర్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి సోమలింగా రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు పోడు భూముల లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News