Thursday, July 4, 2024

బస్సుల్లో రోజుకి 20 లక్షల మంది ప్రయాణం

- Advertisement -
- Advertisement -

మహాలక్ష్మి పథకంతో పెరిగిన మహిళా ప్యాసింజర్ల రద్దీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్ టిసి) బస్సుల్లో రోజుకు 20 లక్షల మంది పయనిస్తున్నారని, అందులో 30 శాతం మందే టిక్కెట్టు కొంటున్నారని టిజిఎస్ఆర్ టిసి వివరించింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలే 70 శాతం ఉచితంగా పయనిస్తున్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని డిసెంబర్ 9న ప్రవేశపెట్టింది. దాంతో మహిళలు పయనించడం ఎక్కువయింది. మహిళా ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. మొదట్లో 16 లక్షల మందే రోజూ ప్రయాణించేవారు. ఇప్పుడు రోజూ 20 లక్షలకు పైగా ప్రయాణిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News