- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి కార్మికులు ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మానిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని ఆర్టిసి కార్మికులు మే 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆర్టిసి జెఎసి నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టిసి ఎండి సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు జెఐసి నేతలు నోటిసులు ఇచ్చారు. మే 7వ తేదీ మొదటి విధుల నుంచి బహిష్కరణ ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని.. సోమవారం వరకూ ఆర్టిసి ఉద్యోగులకు జీతాలు పడలేదని నోటీసుల్లో పేర్కొన్నారు.
- Advertisement -