Monday, January 20, 2025

తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావాలంటే బిజెపి రావాలి: ఈటెల

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రాన్ని సురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో ప్రజాగోస – బిజెపి భరోసా యాత్రలో బైక్ ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు. బిజెపి శ్రేణులు ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం పలికాయి. పానగల్లు లోని పచ్చల సోమేశ్వరాలయంలో ఈటెల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే బైక్ ర్యాలీని ఈటెల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. గుజరాత్ ఎన్నికలు మరోసారి నిరూపించాయని, తెలంగాణలో సమస్యల పరిష్కారం కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీగా బిజెపికి మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో గ్రామ గ్రామానికి ప్రజా భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఈటెల హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News