Monday, December 23, 2024

తెలంగాణ ప్రగతిని ప్రపంచానికి చాటే పరుగు ‘తెలంగాణ రన్’

- Advertisement -
- Advertisement -
  • దశాబ్దిలోనే శతాబ్ది సంక్షేమ, అభివృద్ధి పరుగు
  • 10 ఏళ్లలో అన్ని రంగాలలో సాధించిన ప్రగతి పరుగు
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్: గతంలో చాలా సార్లు పరుగు పందాలు నిర్వహించుకున్నామని కానీ సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ దశాబ్దిలోనే శతాబ్దికి సరిపడ అందించిన సంక్షేమ, అభివృద్ధి, ప్రగతిని, తెలంగాణ ఖ్యాతిని దేశం తోపాటు ప్రపంచానికి చాటి చెప్పే ‘తెలంగాణ రన్’ను ఉత్సాహంగా, ఉల్లాసంగా విజయవంతంగా పూర్తి చేయడం పట్ల హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద జెండా ఊపి ప్రారంభించగా అనభేరి చౌరస్తా మీదుగా తిరిగి వ్యవసాయ మార్కెట్ వరకు 3కే పరుగు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భ ంగా మాట్లాడుతూ యువతీ యువకులలో స్ఫూర్తి నింపేలా తరచుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 10 కే, 5కే రన్ నిర్వహించుకోవడం అభినందనీయం అన్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్న హుస్నాబాద్ తెలంగాణ రన్ ప్రాంత ప్రగతి అభివృద్ధికి నిదర్శనం అన్నారు. రోజురోజుకు వేగం పుంజుకుంటున్న రాష్ట్ర అభివృద్ధి పరుగులో ప్రజలు భాగస్వామ్యం అయి సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రపంచానికి తెలియజేశామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, ప్రగతి రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో పరుగులు పెడుతుందని అన్నిరంగాల్లో రాష్ట్రంను ముందుకు తీసుకెళ్తూ నెంబర్ వన్ స్థాన ంలో ఉంచారని, రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షుణ్ణంగా వి వరించారు. తెలంగాణ రన్ 3కేలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

యువతలో ఉత్సాహాన్ని నింపిన యువ నాయకుడు ఇంద్రనీల్

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ నిర్వహించిన 3కే రన్‌లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ తనయుడు, యువ నాయకుడు ఇంద్రనీల్ పాల్గొని యువతలో ఉత్సాహాన్ని నింపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ప్రాంత యువతి, యువకులలో చైతన్యం, స్ఫూర్తి నింపేలా పోలీస్ శాఖ పరుగు పందాలను తరచుగా నిర్వహించడం వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే అన్నారు. తెలంగాణ రన్ లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయి లేని అనిత, ఎఎంసి చైర్మన్ ఎడబోయిన రజిని, మాజీ ఎంపిపి, హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల వెంకట్, మాజీ ఎఎంసి చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండి అన్వర్, బూట్ల రాజ మల్లయ్య, సారయ్య, హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్, సిఐ కిరణ్, ఎస్‌ఐ మహేష్, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News