Monday, December 23, 2024

ఖమ్మంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ….

- Advertisement -
- Advertisement -

Telangana samaikyatha vajrotsavam rally

ఖమ్మం:  ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఖమ్మం జడ్ పి సెంటర్ వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జడ్ పి సెంటర్ నుంచి నుంచి ప్రారంభమైన ర్యాలీలో భారీగా హాజరైన జనంతో కలిసి కలెక్టరేట్, టిటిడిసి, ఇల్లందు సర్కిల్, పటేల్ స్టేడియం మీదుగా ఎస్ఆర్, బిజిఎన్ఆర్ కళాశాలకు చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్ మధు సుధన్, స్నేహలత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ లు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News