Tuesday, November 26, 2024

ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • వైద్యారోగ్యశాఖలో సమూల మార్పులకు సిఎం కెసిఆర్ శ్రీకారం

గజ్వేల్: ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేస్తోందని ఆమేరకు అధికంగా నిధులను కెటాయిస్తున్నదని ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ప్రజారోగ్య దినోత్సంలో ఆయన ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డితో కలిసి మాట్లాడారు.రాష్ట్రంలోని అతి కీలకమైన శాఖగా భావించే వైద్య శాఖను ప్రజారోగ్యంతో ముడిపడిఉన్న ఇతర శాఖలలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి తెలిపారు. రూ.250 కోట్లతో రాష్ట్రంలోని గర్భిణీలకు ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేసిందన్నారు. ఈ కారణంగా గర్భస్ధ శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మిస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించిడంతో పాటు నూతన ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి కార్పోరేట్ స్థాయిలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమన్నారు. సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో గజ్వేల్ పట్టణంలో జిల్లా ఆసుపత్రి ఏర్పాటు అయి వేలాది మంది రోగులకు వైద్యసేవలు అందిస్తున్నదని, త్వరలోనే చిన్న పిల్లల ఆసుపత్రి కూడా అందుబాటు లోకి రానున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానల ఏర్పాటు,మంత్రి హరీష్ రావు చొరవతో ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి రోగులకు వైద్యసేవలు అందించటంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకుని సత్పలితాలు సాధించామనర్నారు. కెసిఆర్ కిట్‌తో పాటు పుట్టిన బిడ్డనుంచి వివాహం జరిగే వరకు కెసిఆర్ సర్కార్ అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తూ , కెసిఆర్ కిట్స్‌ను కూడా అందించి దేశంలో ఎక్కడాలేని విధంగా ఆదర్శంగా తమ ప్రభుత్వం నిలిచిందని ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి అన్నారు. అనంతరం లబ్దిదారులకు కెసిఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి, ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపిపి దాసరి అమరావతి శ్యాం మనోహర్, జడ్పిటిసి పంగ మల్లేశం, గజ్వేల్ మున్సిపల్ కౌన్సిలర్లు వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News