Saturday, April 5, 2025

దేశానికే దిక్సూచి తెలంగాణ పథకాలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్ : దేశంలో ఆదర్శవంతమైన పథకాలు తెచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ముస్తాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. దేశానికి దిక్సూచి వంటి కార్యక్రమాలు కెసిఆర్ చేపట్టారని గుర్తు చేశారు. ఇంటింటికి తాగునీరు, 24 గంటల విద్యుత్ సరఫరా కెసిఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందన్నారు. త్వరలోనే అర్హులైన పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని వివరించారు. కెసిఆర్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుని తీరుతుందన్నారు. గతంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలపై అందరికీ అనుమానాలు ఉండేవని, ఎవరైనా ఇళ్ల కోసం డబ్బులు అడిగితే ఇవ్వొద్దన్నారు. ఇళ్లు రాని వాళ్లు ఉంటే బాధపడొద్దన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News