Friday, November 22, 2024

తెలంగాణ పథకాలు ఇండియాకే ఆదర్శం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana schemes ideal for India

హైదరాబాద్: అనేక సవాళ్లను ఎదుర్కొని… అద్భుతమైన ఉద్యమాన్ని నడిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల  మేరకు తెలంగాణ సాధించుకున్నామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. 25న జరిగే పార్టీ సమావేశ హైటెక్స్ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడారు. మా పార్టీ విధానాలను పరిపాలనను మెచ్చి ప్రజలు మరోసారి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి అపూర్వమైన విధానాలతో… పాలసీలతో దేశానికి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు దేశ ప్రజలు భారత ప్రభుత్వానికి సైతం కెసిఆర్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మా పథకాలను కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని… వాటిని అనుకరించి… రైతుబంధు లాంటి కార్యక్రమాల స్ఫూర్తితో పిపి కిసాన్ ను  కేంద్రం ప్రారంభించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ఇంటింటికి నల్ల నీళ్ళిచ్చిన మిషన్ భగీరథ కార్యక్రమం మాదిరే కేంద్రం జల జీవన్ మిషన్ ప్రారంభించిందన్నారు. టిఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రం త్వరలో తీసుకురాబోతున్నదని, అర్బన్ లంగ్ స్పెస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తీరుగానే కేంద్రం కూడా నగర వన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించిందన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసే పనిని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేది… అది ఈరోజు తెలంగాణ ఏం చేస్తుందో రేపు భారత్ అదే చేస్తుంది అన్నట్లుగా మారిందని కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంత గొప్పగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నదని, 25 తేదీన జరిగే పార్టీ సాధారణ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని, ఈ సమావేశం హైటెక్స్ లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం సమావేశం సజావుగా సాగేలా అనేక ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈ రోజు సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సభ ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించామని తెలియజేశారు.

సభ నిర్వహణ, దానికి సంబంధించిన ఏర్పాట్లను కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున పలు కమిటీలను కెటిఆర్ ప్రకటించారు. ఆహ్వాన కమిటీ, సభా వేదిక ప్రాంగణం, నగర అలంకరణ, ప్రతినిధుల నమోదు వాలంటీర్ల కమిటీ, పార్కింగ్, భోజన కమిటీ, తీర్మానాల కమిటీ, మీడియా కమిటీ, నగర అలంకరణ కమిటీ మొదలైన కమిటీలను కెటిఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతినిధులకు పార్టీ తరఫున గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు. పార్టీకి ఆహ్వానించిన వారు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News