తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్
దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలోనూ మనలాంటి పథకాలు లేవు
బిజెపి పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు అమలు చేయడం లేదు
ఇంటికి అవసరమైన ప్రతీది ప్రభుత్వం అందిస్తూ అండగా ఉంది
మన జీవితాల్ని మారుస్తున్న కెసిఆర్ కు అందరం అండగా ఉండాలి
హుజురాబాద్ లో మంత్రి గంగుల కమలాకర్
హుజురాబాద్లో 6 8మంది లబ్దిదారులకు 68 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణి
హాజరైన మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోని మిగతా 28 రాష్ట్రాల్లో ఎందుకు లేవని, బిజెపి ప్రభుత్వాలు ఎందుకు తీసుకురావడం లేదని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఈ రోజు హుజురాబాద్ సిటీ సెంటర్ హల్ లో 68 మంది లబ్ధిదారులకు 68లక్షల రూపాయల విలువైన కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్ ,శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సందర్భంగా గంగుల మాట్లాడారు. ఆడబిడ్డకు అండగా నిలబడే కళ్యాణలక్ష్మీ, రైతు సాగుకు బరోసా ఇచ్చే రైతుబందు, వెనుకబడని వర్గాల పిల్లల్ని తీర్చిదిద్దే గురుకులాలు, నిరంతరంగా 24 గంటల కరెంటు, ఆత్మగౌరవం కాపాడే ఆసరా ఫించను, ఇంటింటికి మిషన్ భగీరథ నల్లాలు, అద్భుతంగా ప్రభుత్వ దవాఖానాలను అభివృద్ధి చేయడమే కాక 13 వేలు ఇచ్చే కెసిఆర్ కిట్, ఇలా ఎన్నో పథకాలు ఎందుకు బిజెపి పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలుచేయడం లేదని నిలదీశారు. పేదింట్లో ఆడబిడ్డ పెళ్లి బారం కాకూడదని లక్ష రూపాయలకు పైగా మేనమామ కట్నంగా కెసిఆర్ ప్రభుత్వం ఇస్తుందని, అనంతరం కాన్పుకు అన్ని వసతుల్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో కల్పించడమేకాక కెసిఆర్ కిట్ తో ఆర్థిక భరోసాను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదేనన్నారు. తర్వాత బిడ్డ పెరుగుతున్నప్పుడు కార్పోరేట్ చదువులకు దీటుగా గురుకులాల్ని ఏర్పాటు చేసి ఇంగ్లీష్ లో అద్భుతంగా మాట్లాడే విదంగా తయారుచేస్తున్నామన్నారు. ఒకనాడు ఇబ్బందులతో, పైసలు లేక కూలీపనులకు మన బిడ్డల్ని తీసుకుపోయామని, కానీ నేడు గురుకులాల్లో, ప్రభుత్వ బడుల్లో చదివిస్తూ వాళ్లను ప్రయోజకులను చేస్తున్నామన్నారు. నేడు సీఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉండడంతో పాటు విజయాల్ని సాదిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఇన్ని విదాలుగా అండగా నిలబడి అన్నం పెడుతున్న వారిని మర్చిపోకూడదని, సిఎం కెసిఆర్ అండగా ఉండాలని గంగుల పిలుపునిచ్చారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పేదలు అప్పులపాలై అవస్థలు పడొద్దని ఆలోచించే ముఖ్యమంత్రి కెసిఆర్ అని, ఇంటికి అవసరమయ్యే నీటి దగ్గర్నుంచి బిడ్డ పుడుతే కెసిఆర్ కిట్, చదువుకోవడానికి గురుకులాలు, ఆడబిడ్డ పెండ్లి కోసం కళ్యాణలక్ష్మీ, ఇలా ప్రతీ అవసరాన్ని గుర్తించి కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెంచి ఆకలి లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు. ఇన్ని చేసిన కెసిఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. సంక్షేమ పాలనను అందించడంలో సిఎం కెసిఆర్ కు ఎవరూ పోటీ రాలేరని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు మంత్రుల పిలుపుకు విశేషంగా స్పందించారు. ప్రతీ పథకం గురించి చెబుతున్నప్పుడు జై కెసిఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోంగింది. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, బస్వరాజు సారయ్య, జెడ్పి చైర్మన్ కనమల్ల విజయ, పెద్దఎత్తున స్థానిక ప్రజలు, నాయకులు హాజరయ్యారు.