Saturday, April 5, 2025

తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

Telangana schemes should be implemented in Karnataka

 ఆర్య,ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రాణవానందస్వామి
 గీత కార్మికుల పక్షాన నిలిచింనందుకు రాష్ట్ర మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : కర్ణాటక గీత కార్మికుల పక్షాన సానుకూలంగా స్పందించినందుకు రాష్ట్ర మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌కు శ్రీ నారాయణ గురు శక్తిపీఠం పీఠాధిపతులు, ఆర్య, ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ప్రాణవానంద స్వామి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం కల్లును నిషేధించి గీత కార్మికుల ఉపాధిని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వృత్తిపై నిషేధం విధించడంపై తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పలు వేదికలపై బిజెపి ప్రభుత్వ తీరును ఎండగట్టినందుకు, గీత కార్మికుల పక్షాన సానుకూలంగా స్పందించినందుకు కర్ణాటక గీత కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న ప్రాణవానంద స్వామి మంగళవారం హైదరాబాదులోని కెటిఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయాలని ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో కులవృత్తులను, చేతి వృత్తులను నిర్వీర్యం చేసి వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రులకు ఆయన వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్ అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ళ వేములయ్యగౌడ్, సంఘం రాష్ట్ర నేతలు ధనుంజయగౌడ్, రవి గౌడ్, సుదర్శన్ గౌడ్, సంజయ్ గౌడ్, ప్రతాప్ గౌడ్, బత్తిని లతా గౌడ్, అనిల్ గౌడ్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News