మనతెలంగాణ/హైదరాబాద్:డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికలు నేడు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను సచివాలయ ఉద్యోగులు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో తామే గెలవాలని పలు శాఖల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. మొత్తం సచివాలయం నుంచి 1,101 మంది ఓటర్లు ఉండగా అందులో సచివాలయం నుంచి 999 మంది, అసెంబ్లీ నుంచి 100 మంది, రాజ్‌భవన్ నుంచి 2 ఓటర్లతో మొత్తం 1,101 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించిన ఎన్నికలు నేడు జరుగనున్నాయి. రికార్డు అసిస్టెంట్ నుంచి అడిషనల్ సెక్రటరీ వరకు ఈ ఓటింగ్‌లో పాల్గొనడానికి అర్హులు. ఈ నేపథ్యంలోనే పలు శాఖల నుంచి అభ్యర్థులు భారీగా పోటీ పడుతున్నారు.
రాజకీయ ఎన్నికల మాదిరిగా….
ఈ పోటీ నేపథ్యంలో పలు శాఖల తరపున తామే గెలవాలన్న ఉద్ధేశ్యంతో ఆయా శాఖల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా రహస్య సమావేశాలను నిర్వహించడంతో పాటు కుల, మతం, ప్రాంతం, వర్గాలుగా విడిపోయి ఈ ప్రచారాన్ని నిర్వహించారు. సచివాలయంలోని జిఏడిలో 193 మంది ఓటరులతో సచివాలయంలోని పెద్ద శాఖగా ఉండగా, పైనాన్స్ 115 ఓటర్లతో రెండోస్థానం, మండలి, అసెంబ్లీ 91 ఓటర్లతో మూడోస్థానంలో ఉన్నాయి. ఇక రెవెన్యూ 76 ఓటర్లు, ఆర్ అండ్ బి 53, పంచాయతీరాజ్ 52, ఐ అండ్ సిఏడి 47, హోంశాఖ 39, ఎంఏయూడి 34, ఏ అండ్ సి 31 ఓటర్లు,
వైద్య ఆరోగ్య శాఖ 29 ఓటర్లు, ప్లానింగ్ నుంచి 28 ఓటర్లు, స్కూల్ ఎడ్యుకేషన్ 28 ఓటర్లు, ఎస్సీ డెవలప్‌మెంట్ 27 ఓటర్లు, ఐఎన్‌డి అండ్ సిఎఎం 27 మంది ఓటర్లు, లా 26, హయ్యర్ ఎడ్యుకేషన్ 20, పశుసంవర్ధక శాఖ 20, ఈఎఫ్‌ఎస్ అండ్ టి 19, విద్యుత్ శాఖ 18, గిరిజన సంక్షేమ శాఖ 15, వైఏటి అండ్ సి 14, ఎల్‌ఈటి అండ్ ఎఫ్ 14, మైనార్టీ వెల్ఫేర్ 14, బిసి వెల్ఫేర్ 12, డబ్లూసిడి అండ్ ఎస్సీ 11, సిఏఎఫ్ అండ్ సిఎస్ 06, ఐటిఈ అండ్ సి 03, పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్ 03, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నుంచి ముగ్గురు ఓటర్లు ఉన్నారు.
ప్రెసిడెంట్ పదవి కోసం 9 మంది పోటీ
అయితే నేడు జరిగే ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం 9 మంది, వైస్ ప్రెసిడెంట్ (జనరల్) పదవి కోసం 6 మంది, వైస్ ప్రెసిడెంట్ (ఉమెన్) పదవి కోసం 6, జనరల్ సెక్రటరీ పదవి కోసం 6, అడిషనల్ సెక్రటరీ పదవి కోసం 6, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజింగ్) పదవి కోసం 7, జాయింట్ సెక్రటరీ (ఉమెన్) పదవి కోసం 5, జాయింట్ సెక్రటరీ (స్పోర్ట్) పదవి కోసం 5, జాయింట్ సెక్రటరీ (కల్చరల్) పదవి కోసం 4, జాయింట్ సెక్రటరీ (పబ్లిసిటీ) పదవి కోసం 8, ట్రెజరర్ పోస్టు కోసం 5 మంది మొత్తంగా 66 మంది 11 పదవుల కోసం పోటీ పడుతున్నారు. నేడు రాత్రిలోగా ఈ ఎన్నికలు ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.