Saturday, November 2, 2024

అది తెలంగాణ సచివాలయమా లేక మసీదా? : బిజెపి

- Advertisement -
- Advertisement -
కొత్త సచివాలయ నిర్మాణ శైలిని రాష్ట్ర బిజెపి విమర్శించడం ఇదే తొలిసారి కాదు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివాంర ప్రారంభించనున్న రాష్ట్ర నూతన సచివాలయం, మసీదును తలపిస్తున్నదని, ఇది రాష్ట్రంలోని 85 శాతం హిందువుల మనోభావాలను ప్రతిబింబించడంలేదని తెలంగాణ భారతీయ జనతా పార్టీ(బిజెపి) శుక్రవారం విమర్శించింది. నూతన సచివాలయ నిర్మాణ శైలి ‘చరిత్ర వక్రీకరణ’ వలే ఉందని బిజెపి4తెలంగాణ ట్విటర్ హ్యాండిల్ ఓ గ్రాఫిక్ ద్వారా ట్వీట్ చేసింది. నిర్మాణ శైలి కాకతీయులు లేక శాతవాహన పాలకుల సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేదిగా లేదని పేర్కొంది.

తెలంగాణ నూతన సచివాలయ భవనం నిర్మాణం ఖర్చు న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన నిర్మాణ ఖర్చు కంటే రెండింతలుందని పేర్కొంది. నూతన పార్లమెంటు భవనం ‘సెంట్రల్ విస్టా’ ను టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ రూ. 861.9 కోట్లతో నిర్మిస్తానని 2020 సెప్టెంబర్‌లో కాంట్రాక్ట్ గెలుచుకుంది. కాగా తెలంగాణ నూతన సచివాలయ భవన నిర్మాణం ఖర్చు రూ. 600 కోట్లు అంటున్నారు. అనేక రివిజన్‌ల తర్వాత ఖర్చు మరింత పెరిగి ఉండొచ్చని కూడా అంటున్నారు. సచివాలయ నిర్మాణ శైలిని బిజెపి విమర్శించడం అన్నది ఇదే తొలిసారేమి కాదు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి అధికారం కట్టబెట్టితే నూతన సచివాలయ గుమ్మటాలను(డోమ్స్) కూల్చేస్తానని ఫిబ్రవరి 10న బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. నూతన సచివాలయ గుమ్మటాలు నిజామ్ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవాన్ని సాంప్రదాయిక పద్ధతిలో ఆదివారం చేపట్టనున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 6.00 గంటలకు మూడు యాగాలు చేపడతారని, చండీ, వాస్తు హోమాలు ఉదయం 10.00 గంటలకు జరుగుతాయని, తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయానికి మధ్యాహ్నం 1.20కి చేరుకుంటారని ఆయన తెలిపారు.

పుష్కరములు(శుభ ఘడియలు) మధ్యాహ్నం 1.20 నుంచి 1.32 వరకు..అంటే 12 నిమిషాలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి మెయిన్ గేట్ రిబ్బన్ కట్ చేసి తన ఛాంబర్‌లోకి వెళ్లి తొలి ఫైలును మధ్యాహ్నం 1.30 ఫైనలైజ్ చేయనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హైందవ సంస్కృతి, పర్షియా వాస్తు శైలితో నూతన సచివాలయ భవనం నిర్మించారని, దీనికి తనదైన ప్రత్యేక శైలి ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News