Monday, December 23, 2024

తెలంగాణ వంగడాలు వచ్చాయ్

- Advertisement -
- Advertisement -

అధికోత్పత్తినిచ్చే 15రకాల కొత్త విత్తనాలు విడుదల
వరిలో 10, సజ్జలో 2 కొత్త వంగడాలు
నువ్వులో రెండు, మినుములో ఒక వంగడం

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో చీడపీడలు తట్టుకుని అధిక దిగుబడలు అందించే మరో 15కొత్తవంగడాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఈ కొత్త వండగాలను శుక్రవారం నాడు హోంసైన్స్ కాలేజిలో వ్యవసాయశాఖ కార్యదర్శి, ఇంచార్జి విసి రఘునందన్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భం గా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగంలో కొత్త వండగాల రూపకల్పన నిరంతర ప్రక్రియగా వెల్లడించారు. తె లంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పంటల సాగును గిట్టుబాటు చేయాలన్న లక్షం తో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు.

వ్యసాయరంగం ఎంతో సమస్యలతో కూడుకున్నదని తెలిపారు.పంటలు పండించటం ఒక ఎత్తయితే వాటిని మార్కెట్లో విక్రయించటం మరో ఎత్తు అని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలో నీటిపారుదల వసతి కల్పించిందని, 24గంటల విద్యుత్ సరఫరా, రైతుకు పెటుబడి సా యం, ఇన్‌పుట్ సరఫరా వంటివి కల్పించిందన్నారు. ముందు జాగ్రత్త చ ర్యల వల్ల ఎరువులు సమస్య కూడా లేదన్నారు. రైతులనుంచి ధాన్యం సేకరణలో తగిన జాగ్రత్తులు తీసుకున్నామని  తెలిపారు.వ్యవసాయ వర్శిటి రూపొందించిన కొత్తరకం వంగడాలు వరిలో జాతీయ స్థాయికి సంబంధించిన రకాల్లో రాజేంద్రనగర్ వరి1(ఆర్‌ఎన్‌ఆర్ 11718౦, తెలంగాణ రైస్ 5(ఆర్‌ఎన్‌ఆర్ 28362)తెలంగాణ రైస్6(కెఎన్‌ఎం7048), తెలంగాణ రైస్7(కెఎన్‌ఎం6965), తెలంగాణ రైస్8 (డబ్యుజిఎల్1487) రకాలను విడుదల చేశారు. సజ్జపంటలో తెలంగాణ పశుగ్రాసపు సజ్జ 1(టిఎస్‌ఎఫ్‌బి177), తెలంగాణ పలుకోతల సజ్జ 1(టిఎస్‌ఎఫ్‌బి181) రకాలు విడుదల చేశారు. నువ్వు పంటలో తెలగాణ తిల్ 1(జెసియస్3202)రకాన్ని విడుదల చేశారు.
రాష్ట్ర స్థాయిలో 7రకాలు విడుదల:

రాష్ట్ర స్తాయి వరి వంగడాల్లో రాజేంద్రనగర్ వరి 3(ఆర్‌ఎన్‌ఆర్ 15459), రాజేంద్రనగర్ వరి 4( ఆర్‌ఎన్‌ఆర్ 21278), రాజేంద్రనగర్ 5(ఆర్‌ఎన్‌ఆర్ 29325), జగిత్యాల వరి 2(జెజిఎల్ 28545) జగిత్యాల వరి 3(జెజిఎల్ 27356) రకాలను విడుదల చేశారు. నువ్వు పంటలో జగిత్యాల తిల్ 1(జెసియస్ 1020), మినుములో మధిర మినుము 1(ఎంబిజి1070) రకాలను విడుదల చేశారు. ఈ కోత్తరకం వంగడాలు పంట దిగుబడి, పంటకోత కాలం, తెగుళ్లను తట్టుకునే శక్తి, గింజ నాణ్యత , తదితర లక్షణాలను తెలంగాణ వ్యవసాయ పరిశోధనల డైరెక్టర్ డా.ఆర్ జగదీశ్వర్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా.ఎస్. సుధీర్ కుమార్ , వ్యవసాయ విస్తరణ విభాగం డైరెక్టర్ డా.వి సుధారాణి , మీడియా విభాగం ఇంచార్జి వి.సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News