Monday, December 23, 2024

మార్చి 29న దక్షిణ తెలంగాణలో 8,792 మెగావాట్ల వినియోగం

- Advertisement -
- Advertisement -

Telangana sees rise in power consumption

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3,158 మెగావాట్ల డిమాండ్
రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం
విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోటు రానివ్వం
బాబు జగ్జీవన్‌రామ్ వేడుకల్లో పాల్గొన్న
సిఎండి జి.రఘుమారెడ్డి

హైదరాబాద్: ఈ సంవత్సరం ఎండల ఉధృతి అధికంగా ఉండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి జి.రఘుమా రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర సమరయోధుడు, సమతావాది, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి ఘటించారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అనునిత్యం దళితుల అభివృద్ధి కోసం పాటుబడి, దళిత సమాజంలో అందరితో పాటు గౌరవంగా సమానంగా బ్రతకాలని ఆశించారన్నారు.

వారి పోరాటాలకు గుర్తింపుగా నేడు సమతాదివస్ (సమానత్వ దినోత్సవం)గా జరుపుకుంటున్నామన్నారు. ప్రస్తుతం సంస్థ పరిధిలో మార్చి 29వ తేదీన 8792 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో178.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదయ్యిందని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మార్చి 31వ తేదీన 3,158 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో 67.01 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదయ్యిందన్నారు. రాబోయే రోజుల్లో ఎండల ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి లోటు రాకుండా సంస్థ అన్ని ఏర్పాట్లు చేసిందని, విద్యుత్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి సరఫరా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.శ్రీనివాస్, సిహెచ్.మధన్‌మోహన్ రావు, ఎస్.స్వామి రెడ్డి, పి.నరసింహ రావు, జి గోపాల్, సిజిఎంలు ఎల్.పాండ్య, కె.సాయిబాబా, మజీదుల్లాహ్ ఖాన్, ఎస్‌ఈ సివిల్ శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News