Monday, January 20, 2025

ధాన్యం సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అయిన నేపథ్యం లో సాగు నీటి సౌకర్యం, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడికి రైతు బంధు సాయం, రైతు రుణమాఫీ, రైతు బీమాలాంటి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తక్షణమే మిల్లింగ్ కెపాసిటీ  పెంచాలన్న కేబినెట్ నిర్ణయం మేరకు ఇందుకోసం కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నేడు జీవో జారీ చేసింది. ఈ కమిటీలో ఆర్థికశాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా మరో నలుగురిని సభ్యులగా నియమిస్తూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
అవసరమైన సలహాలు..
20222-023 వానాకాలం, యాసంగిలో ధాన్యం దిగుబడికి తగ్గట్టుగా మిల్లింగ్ కెపాసిటీని పెంచడం, అదనపు ధాన్యాన్ని వేలం వేయడానికి అవసరమైన సలహాలు ఈ కమిటీ ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల అభ్యర్థన మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ విధివిధానాలను రూపొందించడంతో ఈ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవోలో సూచించింది.
కమిటీ పరిశీలనాంశాలు
l మిల్లింగ్ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం.
l దిగుబడి ఎంత? సేకరణ ఎంత? ఎంత మిల్లింగ్ సామర్థ్యం, అవసరం వంటి అం శాలపై సమగ్రంగా వివరాలను కమిటీ సేకరించాలి.
l మిల్లులు ఉన్న ప్రాంతాల్లో ఫుడ్ ప్రా సెసింగ్ జోన్ల కోసం భూములను గుర్తించడం, ధాన్యం మిల్లింగ్ లో పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి అవసరమైన ఇం డస్ట్రీయల్ ఇన్సెంటివ్ పాలసీని తయారు చేయడం
l సంవత్సరంలోగా కొత్త మిల్లులు వచ్చేలా అవసరమైన టెక్నాలజీని కమిటీ గు ర్తించాలి
l ఉన్న పెట్టుపెడిదారులను మిల్లిం గ్ రంగం వైపు వచ్చేలా ఒప్పించి పరిశ్రమలు నెలకొల్పేలా చూడాలి.
l ఉప ఉత్పత్తులు లాభాల్లోకి వచ్చేలా అవసరమైన కార్యక్రమాలను కమిటీ తీసుకోవాలి.
lప్రస్తుతమున్న కస్టమ్ మిల్లింగ్ పాలసీని మార్చి కంపల్సరీ మిల్లింగ్ ను నిర్ణీత పరిణామంలో నిర్ణీత సామర్ధ్యంతో ఉండేలా రూపొందించాలి.
l కెపాసిటీని పెంచేందుకు మార్గదర్శకాల రూపొందించాలి
l క్వాలిటీని అంచనా వేయడం, మార్కెట్ పరిస్థితులు అనుసరించి నాణ్యత, ధరను నిర్ణయించి ధాన్యం వేలం వేయడం వంటి చర్యలు
l యాసంగికి సంబంధించిన రెండు సీజన్లలో వచ్చే ధాన్యాన్ని అనుసరించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
l సభ్యులందరూ సమావేశమై ధాన్యం కనీస ధరను నిర్ణయించాలి
l వేలానికి సంబంధించి మార్గదర్శకాలను సిఫారసు తయారు చేయాలి.
దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవోలో సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News