Saturday, November 23, 2024

ప్రజల అజెండాతో జాతీయ ప్రత్యామ్నాయం

- Advertisement -
- Advertisement -

Telangana should play bright role in center

దేశం అన్నివిధాలా పాడైపోయింది.. కేంద్రంలో తెలంగాణ ఉజ్వలమైన పాత్ర పోషించాలి

టిఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు, ప్రత్యామ్నాయ కూటమిలు కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజల అభ్యున్నతికి తోడ్పడే సరైన ఎజెండా కావాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం గొప్ప మార్పును చూడాల్సి ఉందన్నారు. సరికొత్తగా దేశాన్ని పునర్నిర్వచించుకోవాల్సి ఉందని సిఎం అన్నారు. దేశ గతి, స్థితి మార్చడానికి ఇది చాలా అవసరమన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కో సం టిఆర్‌ఎస్ పుట్టినట్లే దేశం కోసం ఒక శక్తి తప్పకుండా పు డుతుందన్నారు. అది దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, శాన్ని సరైన ప్రగతి పంథాలో నడిపించడానికి దోహదపడే విధంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా తయారైతే అది దేశానికే గర్వకారణం అవుతుందన్నారు. ఆ దారులను వెతకాలన్నారు. నూతన వ్యవసాయం, ఆర్థిక విధానం, పారిశ్రామిక విధానాలు రావాలని ఆకాంక్షించారు. బుధవారం నగరంలోని హెచ్‌ఐసిసి వేదికగా జరిగిన టిఆర్‌ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని సిఎం కెసిఆర్ ప్రారంభోపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాజకీయా ల్లో గుణాత్మక మార్పును సాధించే లక్షంతో ముందుకు సాగుతున్న ట్లు తెలిపారు. ఏడు దశాబ్దాల బిజెపి, కాంగ్రెస్ అసమర్థ పాలన, నిష్క్రియాపరత్వంతో దేశం విసిగిపోయిందన్నారు. ఆ రెండు పార్టీల పరిపాలన వల్ల భారతదేశం చిన్న చిన్న దేశాలతో కూడా పోటీపడలేని పరిస్థితికి వచ్చిందన్నారు. ఒక వరిగింజ, ఒక్క కూరగాయ పండించని సింగపూర్ వంటి దేశాలు ఆర్థికంగా ఎంతో పురోగతిని సాధించాయన్నా రు. కానీ భారతదేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ మనం ఆ దేశంలో ఏ రంగంలోనూ పోటీపడకపోవడం సిగ్గుచేటు కాదా? అ ని ప్రశ్నించారు. అందుకే బిజెపి, కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. ఒక ప్రత్యమ్నాయం కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్రంలో ఏం జరిగిందో ఈ దేశ వాసులందరికీ తెలుసన్నారు. స్వాతంత్య్ర ఫలా లు ప్రజలకు ఏ పద్దతిలో అందాలో పద్ధతిలో లభించలేదని న్నారు.పెడధోరణులు మరింత ప్రబలిపోతున్నాయే తప్ప మంచిదారులు లేదని కెసిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవాంఛీనయమైన, అనారోగ్యకరమైన జాడ్యాలు, పెడధోరణులు ఇటీవల కాలంలో దేశంలో బాగా ప్రబలుతున్నాయన్నారు.

భారత సమాజం శాంతి, సహనాలకు ఆలవాలమైన సమాజమన్నారు. ఇంత అద్భుతమైన దేశంలో కొందరు దుర్మార్గమైన, సంకుచితమైన, ఇరుకైన విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి, దేశ గరిమకు గొడ్డలి పెట్టులా, ఆశనిపాతంలా దాపురించే స్థాయికి మనం పోతున్నామని మండిపడ్డారు. సమయంలో ఒక రాజకీయ పార్టీగా, ఒక రాష్ట్రంగా మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? ఏ రకమైన పద్ధతుల్లో మన ప్రవర్తన ఉండాలి? మన ఆలోచన ధోరణి… మన పాత్ర పోషణ ఏ విధంగా ఉండాలన్న అంశాలపై కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మనం తీసుకునే నిర్ణయం దేశ అభ్యున్నతి కోసం ఉపయోగపడాలన్నారు. అందుకోసం మనమంతా శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

టిఆర్‌ఎస్‌కు పెట్టని కోట
తెలంగాణ రాష్ట్రం టిఆర్‌ఎస్‌కు పెట్టని కోట అని సిఎం కెసిఆర్ అన్నారు. ఎవరు బద్దలు కొట్టలేని కంచుకోట అని స్పష్టం చేశారు. ఇది ఒక వ్యక్తిదో, శక్తిదో కాదన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల సొంత ఆస్తి అని వెల్లడించారు. నిండైనటువంటి, మెండైనటువంటి శక్తితో అనుక్షణం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, ప్రయోజనాలను పరిరక్షించేటువంటి కాపలాదారు టిఆర్‌ఎస్ పారీ అని వ్యాఖ్యానించారు. నాడు రాష్ట్రానికి ఒక సంస్థ లేదు… ఒక పార్టీ లేదు…. ఒక నాయకత్వం లేదన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవరిని పట్టుకొని ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానిదన్నారు.. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి అన్నారు. అలా దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లోంచి ఎగిసిపడిన ఈ తెలంగాణ పతాకం టిఆర్‌ఎస్ పార్టీ అని కెసిఆర్ అన్నారు. రాష్ట్ర సాధనలో అనేక ఒడుదొడుకులు, అవమానాలు ఎదుర్కొన్నామని ఆయన పునరుద్ఘాటించారు.

ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనేక పద్దతుల్లో ఇస్తున్న అవార్ఢులు, రివార్డులే మన పనితీరును మచ్చుతునక అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. 80 శాతం మంది పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది పార్టీ సభ్యులతో, సుమారు రూ. 1000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అలా సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికులు, కాపలాదారుల పార్టీ మన టీఆర్‌ఎస్ అని కెసిఆర్ అన్నారు. తెలంగాణ వచ్చే క్రమంలో చాలా సందర్భాలు, చాలా జ్ఞాపకాలున్నాయన్నారు. ప్రధానంగా ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపిన సందర్భాలున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి….. ఏం చేయాలి….ఏ రకమైన అవరోధాలున్నాయి. ఏ రకమైన అవకాశాలున్నాయనే అనేకమైనటువంటి మేధోమథనం ఆనాటి నుండి ఈ నాటి వరకు మనం చేసుకోగలిగామన్నారు.

మణిద్వీపంలా తెలంగాణ

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవాళ దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్ల అందుబాటులో ఉందన్నారు. అయితే అందుబాటులో ఉన్న వినియోగించలేని పరిస్థితిలో భారత్ ఉందన్నారు. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉన్నప్పటికీ 2 లక్షలకు మించి వాడటం లేదన్నారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. పంటలు ఎండిపోతున్నాయి. మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. చుట్టూ అంధకారం ఉంటే ఒక మణిద్వీపంలా తెలంగాణ వెలుగుతున్నదన్నారు. ఏడేండ్ల క్రితం మనకు కూడా కరెంట్ కోతలేనని పేర్కొన్నారు. కానీ మనం ఆ సమస్యను అధిగమించామన్నారు. వెలుగు జిలుగుల తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నామన్నారు. మన రాష్ట్రంలా కేంద్రం కూడా పనిచేసి ఉంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబై నుంచి కోల్‌కతా వరకు 24 గంటలకరెంట్ ఉండేదన్నారు. ఈ విషయాన్ని దేశంలో ఉన్న సిఎంల సమక్షంలో, ప్రధాని అధ్యక్షతన వహించే నీతి ఆయోగ్ సమావేశంలోనే కుండబద్ధలు కొట్టినట్లు చెప్పానని న్నారు.

ఆకలి కేకలెందుకు : 44 కోట్ల పంటలు పండే భూములున్న దేశంలో ఆకలి కేకలెందుకున్నాయని కెసిఆర్ ప్రశ్నించారు. సజీవంగా ప్రవహించే నదుల్లో ఉండే నీటి లభ్యత 65 వేల టిఎంసిలు ఉండగా, ఇంకా 4, 5 టిఎంసిల లెక్కలు తేలాల్సి ఉందన్నారు.టిబెట్ నుంచి వచ్చే నీటి లెక్కలు అంతర్జాతీయ వివాదంలో ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు కట్టిన ప్రాజెక్టులు, జరిగిన ప్రయత్నాలలో 25 వేల టిఎంసిల నుంచి 30 వేల టిఎంసిల నీటినే దేశం వాడుకుంటున్నదన్నారు. మిగిలిన 35 టిఎంసిల నీరు ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ఈ లెక్కలు తేలాల్సి ఉందన్నారు. ఎందుకీ దౌర్భాగ్యం దేశానికని ప్రశ్నించారు. దీని రహస్యం ఎక్కడుందని నిలదీశారు. దేశంలో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పటికీ దేశంలోని అనే రాష్ట్రాల్లో నీటి యుద్దాలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రధానంగా కావేరి జలాల కోసం తమిళనాడు- కర్ణాటక మధ్య వివాదం ఎందుకున్నారు. సింధు, సట్లేజ్ నదీ జలాల కోసం పంజాబ్- హరియాణ యుద్ధం దేని కోసమని ప్రశ్నించారు. నీటి కోసం రాష్ట్రాలు యుద్ధాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది? అని నిలదీశారు. 75యేళ్ళ స్వాతంత్య్ర పాలనలో తాగునీరు, సాగునీరు లేక ఇంకా దేశం ఎందుకు అల్లాడుతోందన్నారు.

దేశంలో యువశక్తికి కొదవ లేదు

ప్రపంచంలో కెల్లా అత్యధిక యువశక్తి భారత్‌లోనే ఉందన్నారు. కానీ మన దేశంలో సరైన ఉపాధి అవకాశాలు లేక సుమారు 13 కోట్ల మంది వివిధ దేశాల్లో వలస పోయారన్నారు. విదేశాల్లో మన పౌరులు తమ శక్తిసామర్థ్యాలను ధారపోస్తున్నారన్నారు. కనీసం మట్టి, మంచినీళ్లు కూడా సరిగా లేని సింగపూర్‌లో ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది? మన వద్ద అన్నీ ఉన్నా… ఎందుకు ఈ దీన పరిస్థితి?అని ప్రశ్నించారు. విదేశాల్లో ఉంటున్న భారత పౌరులు తమకు గ్రీన్ కార్డు వచ్చిందని ఇక్కడి కుటుంబ సభ్యులకు చెప్తే వారు ఇరుగుపొరుగు వారిని పిలిచి పార్టీ చేసుకుంటున్నారన్నారు. ‘ ఏమిటీ దౌర్భాగ్యం. మనకు ఆస్తి లేకనా, భూమి లేకనా, ఖనిజ సంపద లేకనా, అటవీ సంపద లేకనా, మేధో శక్తి లేకనా, దేశం ఎందుకు ఇట్లా కునారిల్లుతున్నదని కెసిఆర్ ప్రశ్నించారు.

ఈ విషయం మీద అందరం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సింగపూర్ వాళ్ళకు మట్టి కావాలంటే పొరుగు దేశం ఇండోనేషియా నుండి కొనుక్కుంటారన్నారు. మట్టిని షిప్పుల్లో తెచ్చుకుంటారని. అలాగే ఆ దేశంలో. మంచినీళ్ళు కూడా లేవన్నారు. దానిని కూడా మలేషియా నుండి కొనుక్కుంటారన్నారు. వాళ్లు తినే అన్నం ముద్ద కూడా వారిది కాదన్నారు. ఒక కూరగాయ ముక్క కూడా వారిది కాదన్నారు. అయినప్పటికీ సింగపూర్ పరిస్థితి ఏ విధంగా ఉంది… మన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సింగపూర్‌లో ఏమీలేకపోయినా…ఆ దేశం అంత ఉజ్వలంగా ఎందుకు ఉందన్నారు. వారి వద్ద ఏమీలేకున్నా…. మేధస్సు ఉందన్నారు. కానీ మన దగ్గర అన్నీ ఉన్న మేధస్సు లేదని ఆరోపించారు. అందుకే ఇలా కునారిల్లుతున్నామన్నారు. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పు లాంటి నిజమన్నారు.

ప్రజల దీవెన, ఆశీర్వాదంతో మెరుగైన పాలన

రాష్ట్ర సాధన తర్వాత ప్రజల దీవెనలతో, ఆశీర్వాదంతో అద్భుతమైన పరిపాలన అందిస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్‌గా నిలిపామని కెసిఆర్ అన్నారు. రాష్ట్రం సాధిస్తున్న విజయాలను మనకు మనం పొగుడుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం వెలువరిస్తున్నటువంటి ఫలితాలు, అవార్డులు, రివార్డులే ఇందుకు తార్కాణమన్నారు. రెండు రోజుల క్రితం కేంద్రం ప్రకటించిన ప్రకటనలో దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలేవంటే ఒకటి నుంచి వరసగా 10 గ్రామాలు మన రాష్ట్రం నుంచే వచ్చాయన్నారు. మరో 20 గ్రామాలు తీసుకొని పరిశీలన చేస్తే అందులో కూడా 19 గ్రామాలు ఉత్తమమైన గ్రామాలుగా తెలంగాణ నుంచే నిలిచాయన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరును నిదర్శనం కాదా? అని కెసిఆర్ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవార్డులేనటువంటి డిపార్ట్‌మెంటే లేకపోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.నిబద్ధతో, అవినీతిరహితంగా, పట్టుదలతో, లక్ష్యశుద్ధితో, చిత్తశుద్ధితో, సందర్భశుద్ధితో కార్యాచరణ గావిస్తున్నామన్నారు. ఒకనాడు కరువు, కాటకాలకు ఆలవాలమైన తెలంగాణ ప్రస్తుతం జలభాండాగారంగా రూపుదిద్దుకున్నదన్నారు. కాళేశ్వరంలో మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అని చెప్పి అంతర్జాతీయ ఛానళ్ళు కథనాలు వెలువరిస్తూ ఉన్నాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ రెండు ప్రాజెక్టులు మనం పరిపూర్తి చేసుకుంటే నలుచెరుగులా అద్భుతమైనటువంటి పసిడిపంటలతో అలరారే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతున్నదన్నారు. కారుచీకట్ల నుండి వెలుగుజిలుగుల రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. తాగు,సాగునీరు, విద్యుత్తు, సంక్షేమరంగాల్లో….ఇలా ఏ రంగం తీసుకున్నా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించామన్నారు.

అవినీతితో పడిపోయే వికెట్లు రాష్ట్రంలో లేవు

గతంలో ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోతే…. వికెట్ నెంబర్ 1 పోయిందని మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చేవన్నారు. కానీ ఆ రకంగా పోయే వికెట్లు రాష్ట్ర మంత్రవర్గంలో లేవన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే ధ్యేయంగా తద్వారా అందరి యొక్క సమున్నత జీవితమే ఏకైక లక్ష్యంగా పనిచేయడం వల్ల అద్భుతాలు సాధించామన్నారు. రెవెన్యూ రంగంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ దేశాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ కృషికి నిదర్శనమన్నారు. అయితే ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు.

అద్భుతమైన ప్రగతి

అనతి కాలంలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని కెసిఆర్ అన్నారు. ఎన్నో రాష్ట్రాలను అధిగమించి తలసరి ఆదాయంలో మన ఆదాయాన్ని రెట్టింపు చేసుకొని 2 లక్షల 78 వేల రూపాయలకు చేరుకున్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో, జీరో ఫ్లోరైడ్ కలిగిన రాష్ట్రంగా, ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీరు అందించడంలో, ఇలా అనేక రంగాల్లో రాష్ట్రం నెంబర్ వన్‌గా పురోగమిస్తున్నదన్నారు.

రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యాన్ని కేంద్రం కొనలేని అశక్తతను ప్రదర్శించే స్థాయికి మనం ఎదిగామంటే…. ఏ స్థాయికి తెలంగాణ వ్యవసా విస్తరించిందో ఊహించుకోవచ్చునని అన్నారు. ప్రస్తుతం ఏ విధంగా రాష్ట్రం పచ్చని పైర్లతో అలరారుతుందో అలవోకగా అర్థం చేసుకోవచ్చునని అన్నారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి), దేశ జిడిపి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు జిఎస్‌డిపి సుమారు 5 లక్షల కోట్లుగా ఉండేదని… కానీ నేడు రెట్టింపు చేసుకొని 11 లక్షల 50 వేల కోట్లకు చేరుకున్నదని వెల్లడించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసిన స్థాయిలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిచేసుంటే రాష్ట్ర జిఎస్‌డిపి 11.5 లక్షల కోట్లు కాకుండా 14.5 లక్షల కోట్లుగా ఉండేదన్నారు. ఇది తాను చెబుతున్న లెక్క కాదన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చెబుతున్న లెక్కలు…. ఆర్థిక నిపుణులు అంటున్న మాటలన్నారు. ఇలా అద్భుతమైన ప్రగతితో ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయన్నారు. సుమారు 2.5 లక్షలపై చిలుకు ప్రభుత్వోద్యాగాలు కల్పించిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు.

ఉపన్యాసాలు ఉంటే మైకులు పగిలిపోతాయి

దేశ ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని నేతల ప్రసంగాలు వింటే మాత్రం మైకులు పగిలిపోతాయని కెసిఆర్ సెటైర్లు వేశారు. ఇలాంటి ఉపన్యాసాలతో 75 ఏళ్ళ జీవితం గడిచింది తప్ప ప్రజల ఆశలు నెరవేరలేదన్నారు. నేతలు వాగ్ధానాల హోరు కురిపిస్తారు గానీ…. పనిలో మాత్రం జీరోలని పరోక్షంగా మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇది ఎవరి అసమర్థత? దేనికి గీటు రాయి? అని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఉజ్వలమైన, ఉద్విగ్నమైన పాత్ర మన తెలంగాణ కేంద్రంలో పోషించాల్సి ఉంటుందన్నారు.

గద్దెను ఎక్కించాల్సింది పార్టీలను కాదు…దేశ ప్రజలను

గదెన్దు ఎక్కించాల్సింది దేశ ప్రజలనే తప్ప… పార్టీలను కాదని కెసిఆర్ అన్నారు.మనకు రావాల్సింది కావాల్సింది ఫ్రంట్‌లు కాదన్నారు. ఫస్ట్ ఫ్రంట్, మన్ను ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అన్నీ వచ్చాయని ప్రశ్నించారు.ఇవ్వాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నయా ఎజెండా….అద్భుతంగా దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకుపోయే ఎజెండా కావాలన్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన కమ్యూనిస్టు పార్టీ మిత్రులు, జాతీయ నాయకులు తనను కలిశారన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో దేశంలో మనందరం ఇప్పుడు ఏకం కావాలని వాళ్ళంటే….ఎందుకని అడిగానని అన్నారు. బిజెపి పార్టీని గద్దెదించాలని వారి నుంచి సమాధానం వచ్చిందన్నారు. అదే అందరి లక్ష్యం కావాలన్నారు. అదే ఎజెండా మీదైతే…తాను మీతో కలిసి పనిచేయలేనని స్పష్టంగా చెప్పానని కెసిఆర్ పేర్కొన్నారు. ఎవరినో గద్దె దించడం కోసమో, గద్దె ఎక్కించడం కోసమో ప్రయత్నం జరగాలా? అని ప్రశ్నించానని వెల్లడించారు. దేశానికి ఎంతమంది ప్రధానులు రాలేదు…. ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారలేదన్నారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదు. మారవల్సింది ప్రజల జీవితమని చెప్పానని అన్నారు. ప్రజల జీవన స్థితిగతులతో పాటు దేశ పరిస్థితులు, అందరు తలెత్తుకుని గౌరవంగా బ్రతికే పరిస్థితులు రావాలని చాలా స్పష్టంగా చెప్పినట్లు కెసిఆర్ వెల్లడించారు.

గద్దెను ఎక్కించాల్సింది పార్టీలను కాదు…దేశ ప్రజలను

గద్దెను ఎక్కించాల్సింది దేశ ప్రజలనే తప్ప… పార్టీలను కాదని కెసిఆర్ అన్నారు.మనకు రావాల్సింది కావాల్సింది ఫ్రంట్‌లు కాదన్నారు. ఫస్ట్ ఫ్రంట్, మన్ను ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అన్నీ వచ్చాయని ప్రశ్నించారు.ఇవ్వాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నయా ఎజెండా….అద్భుతంగా దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకుపోయే ఎజెండా కావాలన్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన కమ్యూనిస్టు పార్టీ మిత్రులు, జాతీయ నాయకులు తనను కలిశారన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో దేశంలో మనందరం ఇప్పుడు ఏకం కావాలని వాళ్ళంటే….ఎందుకని అడిగానని అన్నారు. బిజెపి పార్టీని గద్దెదించాలని వారి నుంచి సమాధానం వచ్చిందన్నారు. అదే అందరి లక్ష్యం కావాలన్నారు. అదే ఎజెండా మీదైతే…తాను మీతో కలిసి పనిచేయలేనని స్పష్టంగా చెప్పానని కెసిఆర్ పేర్కొన్నారు. ఎవరినో గద్దె దించడం కోసమో, గద్దె ఎక్కించడం కోసమో ప్రయత్నం జరగాలా? అని ప్రశ్నించానని వెల్లడించారు. ఎంతమంది ప్రధానులు దేశానికి రాలేదు.. ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారలేదన్నారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదు.

మారవల్సింది ప్రజల జీవితమని చెప్పానని అన్నారు. ప్రజల జీవన స్థితిగతులతో పాటు దేశ పరిస్థితులు, అందరు తలెత్తుకుని గౌరవంగా బ్రతికే పరిస్థితులు రావాలని చాలా స్పష్టంగా చెప్పినట్లు కెసిఆర్ వెల్లడించారు. సందర్భంగా మరో అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మహిళా స్వయం సహాయక సంఘాల యాడ్‌ను చూసి తన కళ్ళ వెంట నీరు తెప్పించిందన్నారు. అద్భుతమైన సహజవనరులన్న ఈ దేశంలో ఒక్క పూట తిండి తినాలా? ఒక్క పూట తిండి తినే బాధను తప్పించినట్లు ఆ ప్రభుత్వం యాడ్ ఇస్తోందన్నారు. ఆ రాష్ట్ర తలసరి ఆదాయం మన రాష్ట్రంలో చారణా కూడా లేదన్నారు. కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన నేత ఒకరు హైదరాబాద్ గడ్డ మీద మాట్లాడతాడు. మనకు నీతులు చెప్తాడని ఎద్దేవా చేశారు. పైగా ఆయన ఉపన్యాసంలో రేషన్ బియ్యం అందిస్తున్నందుకు ఓట్లు వేయాలని అడుతున్నాడు. రేషన్ బియ్యం ఇచ్చినందుకు ఓట్లేయాలనే దుస్థితికి దేశం చేరుకున్నదన్నారు. ఇది భారతదేశమా… దేశం ఇలాగే ఉండాలా? అని ప్రశ్నించారు. 75 వేల తలసరి ఆదాయమున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి…. 2 లక్షల 78 వేల తలసరి ఆదాయమున్న తెలంగాణకు నీతులు చెబుతారా? అని మండిపడ్డారు.

దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది

దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం లక్ష్యమంటే ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతం కాదన్నారు. ఒక పార్టీ ప్రవచించే నాలుగు మాటలు కాదని పేర్కొన్నారు. దానికి సామూహిక లక్ష్యం, గమ్యం ఉండాలన్నారు. ఆ లక్ష్యం దిశగా సామూహిక ప్రయత్నం చేయాలన్నారు. 1980 వరకు భారతదేశ జిడిపి కంటే చైనా జిడిపి చాలా తక్కువన్నారు. భారతదేశంలో పండే పంటలకంటే తెలంగాణలో పండే పంటలు తక్కువన్నారు. వ్యవసాయానుకూల భూమిని కలిగి ఉండటంలో భారత్ తర్వాతే చైనా అని అన్నారు. కానీ కేవలం 20,30 సంవత్సరాల్లో చైనా దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందన్నారు. ప్రపచంలోనే రెండవ ఆర్థికశక్తిగా ఎదిగిందన్నారు. మరి మనమెక్కడ ఉన్నామన్నారు. మన లక్ష్యం ఏమిటి? ఏ దిశగా పోతున్నామన్నారు. మన రాష్ట్రంలో ఉండే ఒక జిల్లా అంత ఉండదు… ఇజ్రాయిల్ దేశమన్నారు. కానీ అక్కడి నుంచే ఆయుధాలు కొంటున్నామన్నారు. అలాగే జిల్లా అంత ఉండని ఆస్ట్రియా దేశం నుంచి పంపులు తెచ్చుకుంటున్నామన్నారు. దీని మీద తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి, యావన్మంది దేశ ప్రజలు ఒకే త్రాటి మీద నడలేని దుస్థితికి దేశం ఎందుకు దిగజారింది? దాని కారణమేంటి? బలహీనత ఏంటి? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఎందుకు కొరగాకుండా ఈ దేశం ఎందుకున్నది… దీనికి నివారణ ఏమిటని ప్రశ్నించారు.

ప్రపంచానికే ఆదర్శం కానున్న దళితబంధు

అద్భుతమైన సమాజాన్ని సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తెలపెట్టిన మరో బృహత్తర కార్యక్రమం దళితబంధు అని కెసిఆర్ అన్నారు. ఈ పథకం దేశానికి, ప్రపంచానికే ఆదర్శం కాబోతున్నదన్నారు. దళితజాతిలో రత్నాలు, మణులు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, అద్భుతమైన ప్రతిభాసంపన్నులు కోకోల్లలుగా ఉన్నారన్నారు. వారికి దళితబంధు తగు అవకాశాలను కలిగిస్తున్నదన్నారు. దళితబంధులో మూడు కార్యక్రమాలు… మూడు పార్శ్వాలున్నాయన్నారు. ఇందులో మొదటిది 17.5 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా సంవత్సరానికి 2 లేదా 2.5 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేయడమన్నారు. ఇచ్చిన నిధులకు కిస్తీలు లేవు… తిరిగి కట్టేది లేదన్నారు. అలాగే బ్యాంకు లింకేజీ లేదు… వారికి నచ్చిన పని చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఇక రెండవది ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చే అన్ని రంగాల్లో వారికి రిజర్వేషన్లు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించామన్నరు. హాస్టల్స్ సప్లైస్, హాస్పటల్ సప్లైస్ లో, వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించి అమలు చేశామన్నారు. ఈ పథకం ద్వారా ఇచ్చే రూ. 10 లక్షలతో దళితబిడ్డలు ఎన్ని పనులైనా చేసుకోవచ్చునని అన్నారు. ఇందులో ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ఇక మూడవది దళిత రక్షణ నిధి అన్నారు. దీని ద్వారా లబ్దిదారులకు ఇచ్చే రూ. 10 లక్షల రూపాయల్లో నుండి వారి రక్షణ కోసం రూ. 10 వేలు, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరో రూ.10వేలు కలిపి మొత్తం రూ.20వేలను రక్షణ నిధి కోసం జమ చేస్తున్నామన్నారు. బిపిఎల్ పరిధి నుండి ఎపిఎల్ పరిధిలోకి పోయినవారు తిరిగి ఏదైనా కారణాలతో బిపిఎల్ పరిధిలోకి వస్తే వారి రక్షణ కోసం ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకంలో అద్భుతాలు జరిగి తీరుతాయన్నారు

కత్తులు, తుపాకులతో ఊరేగింపులా

దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలపై కెసిఆర్ ధ్వజమెత్తారు. ఈ దేశానికి కావాల్సింది కత్తుల కోలాటలు, తుపాకుల చప్పుళ్లు కాదన్నారు. ఇలాంటి దేశమేనా మనకు కావాల్సిందన్నారు. మహాత్ముడు కలలగన్నది ఈ దేశమేనా? ఇదేనా ప్రజలు కోరుకునేది?కత్తుల కోలాటలు ఎవరికి కావాలని ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సిన కరెంట్, సాగునీరు, తాగునీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అని స్పష్టం చేశారు. అలాంటి వాటిపై కేంద్ర పాలకులు దృష్టి సారించకుండా పుల్వామా, సర్జికల్ స్ట్రైక్స్, కశ్మీర్ ఫైల్స్ అంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇదేమీ దౌర్భాగ్యమని ప్రశ్నించారు. ప్రేమతో, అనురాగంతో సోదరభావంతో ఉజ్వలమైన భారత్‌ను నిర్మించాలన్నారు.

విధ్వంసం సృష్టిస్తే పరిశ్రమలు వస్తాయా?

మన పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించిందని కెసిఆర్ గుర్తు చేశారు. అక్కడ 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలున్నాయి. పరోక్షంగా మరో 30 లక్షల మంది బతుకుతున్నారు. దీని వెనుకాల ఎంతో కృషి ఉందన్నారు. కానీ ఇటీవల కాలంలో హిజాబ్, హలాల్ జరుగుతుందన్నారు. కులం మతం పేరుతో దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. అమెరికాలో మనోళ్లు 13 కోట్ల మంది ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారు మీరు మా మతస్తులు, కులస్తులు కాదు అని పంపిస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదా? మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ దేశం ఉద్యోగాలను ఇస్తదా? ఇది ఎవరికీ మంచిది కాదు. దీని వల్ల ఏం సాధిస్తారు. దేశం అన్ని రంగాల్లో నాశనమై పోతుందన్నారు. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం…ఆకలి పెరిగిందన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నిత్యావసరల ధరలు పెరుగుతున్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. ఇన్నీ సమస్యలతో దేశం సతమతమవుతుంటే.దీనిపై దృష్టి పెట్టకుండా విద్వేషం, ద్వేషం ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు.

భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి

కేంద్రంలో బిజెపి సర్కార్‌రు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) రావాలనే ప్రతిపాదనలు అధికంగా వస్తున్నాయని కెసిఆర్ అన్నారు. మా పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుడు ఒక దినపత్రికలో ఇచ్చిన వ్యాస్యం కూడా చదవానని అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో బిఆర్‌ఎస్ ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరముందన్న విషయాన్ని చాలా స్పష్టంగా విశదీకరించారన్నారు. ఇలాంటి ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయన్నారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఇది ఏ రూపంలో ఉండాలనే అంశంపైనే మేధోమథనం జరుగుతోందని కెసిఆర్ వెల్లడించారు.

తిన్నది అరగట్లేదా అని అడిగారు

2వేల సంవత్సరంలో తాను తెలంగాణ గురించి మాట్లాడితే తిన్నది అరగట్లేదా అన్నారని కెసిఆర్ పేర్కొన్నారు. అయితే తాను తల్లిదండ్రులు, భగవంతుడికి దండం పెట్టి అడుగు ముందుకేశానని అన్నారు. ఈ 20 ఏళ్లలో ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడమే కాకుండా రాష్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకపోతున్నామని కెసిఆర్ వెల్లడించారు. మన రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతున్న కారణంగానే 11 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు. సుమారు 25 నుంచి 30 లక్షల మంది అనేక రంగాల్లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నారన్నారు. ఇవాళ బీహార్ హమాలీ కార్మికులు లేకపోతే రాష్ట్రంలో రైస్ మిల్లుల నడవయన్నారు.

డైరీ ఫామ్‌లు కూడా నిలిచిపోతాయన్నారు. నిర్మాణరంగంలో 95 శాతం మంది బెంగాల్, బీహార్ ,ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికులు పనిచేస్తున్నారన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వేధించే సమయంలో నానాకష్టాలు పడుతున్న వలస కూలీలకు బియ్యం,రేషన్, మందులిచ్చి, 178 ప్రత్యేకమైన రైళ్ళు పెట్టి, టికెట్ ఛార్జీలు భరించి, వారి భోజన సదుపాయం కల్పించి, వారి వారి ఊళ్ళకు పంపించామన్నారు. చేతి నిండా పని దొరుకడంతో పాటు కడుపు రక్షణ ఉంటుంది… మంచి చెడ్డలు చూసే ప్రభుత్వముందని చెప్పి అందరికందరు తిరిగి వచ్చారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. మొదటి విడతలో 50 కోట్ల మొక్కలు పెంచి, గ్రామ గ్రామానికి తీసుకుపోయి ఇచ్చామన్నారు. కానీ అనుకున్న రీతిలో పనులు జరగలేదన్నారు. ఇక రెండవసారి గెలిచిన తర్వాత పని జరగాలంటే ఏం చేయాలి? అని ఆలోచించి చట్ట ప్రేరణ, శాసన ప్రేరణ ఉండాలని నిర్ణయించామన్నారు., విధులు నిర్లక్ష్యం చేసిన వారికి శిక్షలుండాలే అని కఠిన నిర్ణయం తీసుకొని నూతన పంచాయతీరరాజ్ చట్టం తీసుకొచ్చాన్నారు. 12,769 గ్రామపంచాయతీలుంటే అంతమంది సెక్రటరీలను నియమించి వారికి బాధ్యతలు అప్పగించామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News