Monday, January 13, 2025

కీసరగుట్టలో ఘనంగా తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

- Advertisement -
- Advertisement -
  • పాల్గొన్న మంత్రి చామకూర మల్లారెడ్డి
  • చర్చి, మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు

కీసర: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా బుధవారం ప్రముఖ శైవ క్షేత్రమైన కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామలింగేశ్వర స్వామి వారికి మహాన్యాస రుద్రాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్థానిక టీటీడీ వేద పాఠశాల విద్యార్ధులు వేద పఠనం చేశారు. అనంతరం నాద నీరాజనం, పౌరాణిక చిందు యక్షగానం, భజనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శ్రీరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రికి ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం మహామండపంలో స్వామి వారి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఛైర్మన్ తటాకం రమేష్ శర్మ మంత్రి మల్లారెడ్డిని స్వామి వారి శేశ వస్త్రంతో సత్కరించారు. ఈవో నరేందర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆలయాలు, ప్రార్ధన మందిరాలకు పున:వైభవం

సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రభావాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్ వైభవం సంతరించుకున్నాయని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, కీసరలోని పెంతకోస్టు మిషన్ చర్చిలో, యాద్గార్‌పల్లి మసీదులో ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వ మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ సర్వమత సామరస్యాన్ని చాటుతున్నారని అన్నారు. శ్రీలక్ష్మీ నృసింహా స్వామి కొలువైన యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ది చేసి జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ అదే తరహాలో కొండగుట్ట రాజన్న ఆలయం, ధర్మపురి నర్సింహ్మ స్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయాల అభివృద్దికి రూ.వంద కోట్లు కేటాయించారని మంత్రి అన్నారు. మైనార్టీల ప్రార్ధనా మందిరాలకు సైతం పూర్వ వైభవం తెచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల్లో దూపదీప నైవేద్యం పథకంలో ఒక్కో ఆలయానికి ప్రతి నెల రూ.2 వేలు, అర్చకుడికి రూ.4 వేల గౌరవ వేతనం, మైనార్టీల ప్రార్ధనా మందిరాల్లో మౌజమ్‌లు, ఇమామ్‌లకు నెలనెల వేతనాలు అందిస్తుందని తెలిపారు.

అన్ని వర్గాల పండుగలకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేష్, ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News