Wednesday, January 22, 2025

విజేతలకు వేదికగా తెలంగాణ క్రీడా అకాడమీలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్

మన తెలంగాణ/ హైదరాబాద్:  తెలంగాణ స్పోర్ట్ అథారిటీ అకాడమి విద్యార్థులు కష్టపడి చదివి, చదువులో ఇష్టపడి ఆడి, ఆటల్లో రాణించాలని స్పోర్ట్ అథారిటి ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఇటీవల హన్మకొండలో జరిగిన 67వ రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడల్లో సైక్లింగ్ వెలోడ్రమ్ రెజ్లింగ్ అకాడమీ క్రీడాకారులు ఆకాష్ , శివ సంపత్ , ఎన్. సతీష్ బంగారు పతకాలు సాధించిన సందర్భంగా వారిని సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి, ఇష్టపడి ఆటల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రభుత్వం గత దశాబ్ది కాలం నుండి అన్ని రంగాల్లో అంచెలంచెలుగా చేసిన అహర్నిష కృషికి ఫలితాలు స్పష్టం అవుతున్నాయని, సిఎం కెసిఆర్ నాయకత్వంలో రానున్న రోజుల్లో క్రీడలకు, యువతకు మరింత మెరుగైన అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. తెలంగాణ స్పోర్ట్ అథారిటి అకాడమి పిల్లలు అటు క్రీడల్లో, ఇటు చదువుల్లో రాణించడానికి సాట్స్ వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చిందని, అకాడమీలోని ప్రతి క్రీడా విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి నైపుణ్యానికి మెరుగు పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ అథారిటి డిప్యూటి డైరెక్టర్లు చంద్రారెడ్డి, ధనలక్ష్మి, రవీందర్, ఓఎస్‌డి కె. నర్సయ్య, మనోహర్, స్టేడియం అడ్మినిస్టేటర్లు, గోకుల్ యాదవ్, కోచ్‌లు జైపాల్, విజయ్‌భాస్కర్, నిర్మల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News