Thursday, January 9, 2025

పాత పద్ధతిలోనే టెన్త్ మార్కులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి మార్కుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూ ర్తిగా రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. 2024 25 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్లెట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సైన్స్ సబ్జెక్టులో ఒక్కో పేపర్‌కు 12 పేజీల ఆన్సర్ షీట్ ఇస్తారు. ఈ మేరకు మార్పులతో కూడిన ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం విడుదల చేశారు. పదవ తరగతి పరీక్షలలో ప్రస్తుతం ఉన్న గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. దీని స్థానంలో గతంలో మాదిరిగానే మార్కులను వెల్లడించనున్నారు. పదోతరగతి ప రీక్ష ఫలితాల్లో 2014 వరకూ మార్కులు ఇచ్చే విధానం అమలులో ఉండేది. విద్యార్థులకు వచ్చిన ప్రైవేట్ పాఠశాలల మార్కెటింగ్ కోసం ప్రచారం చేసుకుంటున్నారనే ఆరోపణల నే పథ్యంలో మార్కుల స్థానంలో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చారు.

తొలిసారి 2014లో మా ర్కులు, గ్రేడింగ్ ఇచ్చారు. 2015 నుంచి కేవలం గ్రేడింగ్ మాత్రమే ఉండేది. 75 శాతం మా ర్కులు దాటితే వంద మార్కుల వరకూ ఎ గ్రేడ్ ఇచ్చే వాళ్ళు. అయితే, సిబిఎస్‌సి, ఇతర స్కూళ్ళు ఇప్పటికీ మార్కులు ఇస్తున్నాయి. కొన్ని పరీక్షలకు టెన్త్ మార్కులు కోరుతున్నారు. ఇవన్నీ సాంకేతిక సమస్యలు తెస్తున్నాయని భావించిన ప్రభుత్వం పాత విధానాన్ని తీసుకొచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతీ సబ్జెక్టులోనూ ఇప్పటి వరకూ 20 ఇంటర్నల్ మార్కులు ఉండేది. సంవత్సరంలో నాలుగు సార్లు జరిగే ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షల ఆధారంగా ఈ మార్కులు వేస్తారు. దీనిపై పూర్తిస్థాయి పాదర్శకత లోపించిందనే ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టానుసారం 20 మార్కులూ వేసుకుంటున్నారని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్ మార్కులను తీసివేసినట్టు విద్యాశాఖ తెలిపింది.

సంస్కరణలను స్వాగతిస్తున్నాం : పి.రాజభాను చంద్రప్రకాశ్
పదవ తరగతి పరీక్షల సంస్కరణలను తెలంగాణ రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘ స్వాగతించింది. క్లిష్టమైన గ్రేడింగ్ విధానాన్ని తొలగించడం, విద్యార్థులపై విపరీతమైన భారంగా మారిన రాతపని ఇంటర్నల్ అసెస్మెంట్‌లను వార్షిక పరీక్షల మార్కుల కోసం పరిగణలోకి తీసుకోకపోవడం, ఈ రెండు అంశాలు విద్యార్థులకు మేలు చేస్తాయని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రాజభాను చంద్రప్రకాశ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా కొంత బోధనపైన ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందని తెలిపారు. మిగిలిన తరగతులకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News