Monday, January 20, 2025

18న తెలంగాణ రాష్ట్ర బౌల్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : తెలంగాణ రాష్ట్ర బౌల్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఈనెల 18న నగరంలో ఆల్ఫా క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్నామని బౌల్స్ స్పోర్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రకటించింది. తమ ఫెడరేషన్ అంతర్జాతీయ డిబోల్స్ వరల్డ్ పెటాంక్ అండ్ బౌల్స్ ఫెడరేషన్‌కి అనుబంధమని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం. వరుణ్ కుమార్ వెల్లడించారు. ఈమేరకు గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలు మూడు కేటగిరీలలో అండర్ 14, 19,23 వయస్సు (బాలురు, బలికలు) గ్రూప్‌లలో నిర్వహిస్తామన్నారు. పురాతన మైనదని ఓలింపిక్ క్రీడ అని పేర్కొన్నారు.

ప్రతి జట్టులో అరుగురు క్రీడాకారులు ఉంటారని, ప్రతి ఒక్కరికి మూడు బాల్స్ ఇస్తామని వివరించారు. 3 సర్కూట్స్‌లో ఉన్న జాక్ పాయింట్‌లోని చేరువగా అండరామ్స్ నుంచి బాల్‌ను విసరాలన్నారు. నాకౌట్, సెమిఫైనల్, ఫైనల్ ద్వారా విజేతలను ఏంపిక చేసి మెడల్స్ ప్రశంసా పత్రాలు ప్రదానం చేస్తామని వరుణ్‌కుమార్ వెల్లడించారు. టీంల ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని, తెలంగాణ జిల్లాలోని క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి కల్గిన ఔత్సాహికులు, క్రీడాకారులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోడానికి ఫోన్ నెంబర్లు 8297201123,9573843310 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News