బిసి రిజర్వేషన్లు, ఎస్‌సి వర్గీకరణపై
విధాన నిర్ణయం తీసుకునే అవకాశం
మహిళల కోసం మరికొన్ని ప్రత్యేక
పథకాలు ప్రవేశపెట్టే అంశంపై చర్చ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మం త్రివర్గ సమావేశం నేడు మధ్యాహ్నం సచివాలయంలో సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జ రుగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహ ణ, ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్టుగా తెలిసింది. బిసి కులగణను రెండోసా రి నిర్వహించిన నేపథ్యంలో ఈ అంశంపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై పలు విజ్ఞప్తులు వచ్చిన నే పథ్యంలో దీనిపై మంత్రివర్గంలో చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అ వకాశం ఉందని తెలిసింది. ఇందిరా మహిళాశక్తిని బలోపేతం చేయడంపై ఇప్పటికే దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవల స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ పంపులను కేటాయించడం, ఆర్టీసి అద్దె బస్సుల్లో మహి ళా సంఘాలకు అవకాశం ఇవ్వడం వంటి కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చింది. వీటితోపాటు మరికొన్ని కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టుగా తెలిసింది. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి ఎండోమెంట్ సవరణ బిల్లును కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
బడ్జెట్ సమావేశాల్లో ఏయే బిల్లులు
వీటితో పాటు బిసి రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలిసింది. బిసిలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమి షన్ సిఫార్సుల్లో మూడింటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. బిసి రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, బడ్జెట్ సమావేశాల్లో ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలా అన్న విషయంపై ఈ కేబినెట్‌లో స్పష్టత రానుంది. వీటితో పాటు ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రధానితో సమావేశం, ఎపితో ఉన్న నీటి వివాదంపై అనుసరించాల్సిన వ్యూహం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అదే విధంగా ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు లబ్ధి చేకూరేలా మరిన్ని కొత్త పథకాలు తీసుకు రానున్నట్టు గా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయా పథకాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్టుగా సమాచారం.