Sunday, December 22, 2024

కొత్త పరిశ్రమలకు కేరాఫ్ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: టిఎస్ ఐపాస్ విధానంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని, దీనికి సిఎం కెసీఆర్ దార్శనికత కారణమని, స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభు త్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తుందని తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రా మారావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని గుంతపల్లిలో రూ.300ల కోట్ల పెట్టుబడితో 40 ఎకరాల్లో మంత్రి కెటిఆర్, మోనిన్ కంపెనీ ఎండి ఓలివియన్ మోనిన్, సర్పంచ్ సుమిత్రతో కలిసి కంపెనీ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ దేశంలో మోనినే కంపెనీ ఏర్పాటు చేస్తున్న మొదటి ప్లాంట్ ఇది. ఈ సందర్బంగా ఐటి శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ స్థానిక యువతకు ఉద్యోగం కల్పించడానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిందన్నారు. 18 నెలల్లో కంపెనీ నిర్మాణం పూర్తి చేసేందుకు యాజామాన్యం సిద్దంగా ఉందని, స్థానిక ప్రజా ప్రతినిదులు, అధికారులు కంపెనీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకువచ్చిందన్నారు.

ఇది జీరో పొల్యూషన్ ప్లాంట్ అని అన్నారు. ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. అవి ఎన్నికలప్పుడు చేసుకోవచ్చు. కొంతమంది ప్రతిదానిని రాజకీయం చేస్తారు. నిజనిజాలు తెలుసుకోవాలి అని మంత్రి కెటిఆర్ హితవు పలికారు. మన మీద నమ్మకంతో ఎవరు పెట్టుబడి పెట్టినా సహకరించాలని సూచించారు. ఎవరు ఏ కంపెనీ పెట్టినా, కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ మారిందన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 5 విప్లవాలతో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని అన్నారు. తెలంగాణలో పండే పత్తి పంట దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, ఐటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అడిషనల్ కలెక్టర్ మాధురి, ఎస్‌పి రమణకుమార్, ఎమ్మెల్సీ సత్యనారాయణ, డిసిసిబి వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యం, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల, ఫ్రెంచ్ సిజి సేరీ, నాయకులు జైపాల్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, విఠల్, పాండురంగం, మాణిక్ ప్రభు, గోవర్దన్‌రెడి, రామాగౌడ్, తదితరులున్నారు. స్థానిక నాయకుడు, సంఘ సేవకుడు అనంతరెడ్డి పేరును కేటిఆర్ ప్రస్తావించగానే, అక్కడికి వచ్చిన గ్రామస్థులు ఈలలు వేశారు. దీంతో మీరంతా అనంత్‌రెడ్డి ఫ్యాన్సా? అని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News