Monday, December 23, 2024

దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ కె.శశాంక

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి : దశాబ్ది వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు. అసవరం ఐడిఓసిలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహిస్తుందన్నందున రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో దశాబ్ధి వేడుకల నిర్వహన ఏర్పాట్లు తీరుతనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక నివేదిస్తూ.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్ధాయి వరకు ప్రణాళికబద్ధంగా అధికారులను నియమించమని ప్రతి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు.

జిల్లాలో 82 రైతు వేదికలు ఉన్నాయని, వాటిని మామిడి తోరణాలతో ముగ్గులతో వైభవంగా అలంకరించడం జరగుతుందన్నారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధులు రైతుల సహకారంతో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు అలంకరింపజేసి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రైతు దినోత్సవం సాగునీటి దినోత్సవం చెరువుల పండగ తెలంగాణ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మంచినీళ్ల పండుగ హరితోత్సవం కార్యక్రమాలను అంగరంగా వైభవంగా చేపడుతామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో ఉత్తమంగా రాణించిన ఉద్యోగులను సన్మానించడం జరుగుతుందని తెలిపారు.

పల్లె పట్టణ ప్రగతిలో గ్రామ పంచాయితీలలో జాతీయ జెండా ఎగరవేయడం జరుగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ జిల్లాలో పండుగ వాతావరణం కనించాలని దశాబ్ధకాల అభివృద్ధిని ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌పి శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్, జడ్‌పి సిఈఓ రమాదేవి, డిఆర్‌డిఏ పిడి సన్యాసయ్య, ఆర్‌డిఓలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News