మన తెలంగాణ/హైదరాబాద్ : బాలల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, శాస్ట్రీయ దృక్పథంని పెంపొందించడానికి, సామాజిక మహాత్మాగాంధీ జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అవగాహన కల్పిస్తూ ప్రాథమిక విధులపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం జవహర్ బాల్ మంచ్ ఉద్దేశం అని మామిడి రిషికేశ్ రెడ్డి అన్నారు. ఎఐసిసి ఆదేశాలననుసారం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ నియామక పత్రం అందజేశారు. ఈ సదవకాశాన్ని తనకు కల్పించినందుకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, జెబిఎం జాతీయ చైర్మన్ డాక్టర్ జి.వి.హరి, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బి.వి.శ్రీనివాస్, కృష్ణ అలివేరు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త కాపు శివసేనారెడ్డి, రాష్ట్ర ఒబిసి సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు పదవి కంటే బాధ్యత అని అన్నారు. తనను నమ్మి ఇచ్చిన బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తానని అన్నారు. త్వరలో అందరూ పెద్దలను సంప్రదించి కార్యాచరణను ప్రకటిస్తాం అని అన్నారు.
జవహర్ బాల్ మంచ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా మామిడి రిషికేశ్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -