Wednesday, January 22, 2025

‘లక్ష’ణంగా ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -

మన కుల వృత్తులకు చేయూత నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బిసి, ఎంబిసి కులాలు కుల వృత్తులే ఆ ధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూస ల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచా ర జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సోమవా రం నాడు డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సిఎం కెసిఆర్ ఈ అంశంపై సమీక్ష సమావేశం ని ర్వహించారు. చేతి వృత్తి దారులకు రూ.లక్ష చొప్పు న దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి అమలు, వి ధివిధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ చైర్మన్, బిసి సంక్షేమ శాఖ మం త్రి గంగుల కమలాకర్ సిఎం కెసిఆర్‌కు వివరించారు. త్వరితగతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని సిఎం మంత్రి గంగులను ఆదేశించారు.
అన్ని శాఖల హెచ్‌ఒడిలు ఒకేచోట
సచివాలయం పూర్తిస్థాయిలో పని విధానంలోకి వ చ్చిన నేపథ్యంలో, ఆయా ప్రభుత్వ విభాగాధిపతు ల (హెచ్‌ఒడి) కార్యాలయాలను ఒకేచోటుకు చేర్చ డం గురించి సిఎం చర్చించారు. హెచ్‌ఒడి అధికారులకు సెక్రటేరియట్‌తో తరచుగా పని ఉంటున్న నేపథ్యంలో తరువాయి 12లో
వారి కార్యాలయాలను కూడా సెక్రటేరియట్ దగ్గరలో సమీకృతంగా ఒకే చోట నిర్మించేందుకు సిఎం కెసిఆర్ నిర్ణయించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్‌ఒడిలు వాటి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్‌కు అందుబాటులో విశాలవంతమైన ప్రభుత్వం స్థలాలు ఎక్కడెక్కడున్నాయో సిఎం అడిగితెలుసుకున్నారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్‌ఒడిలన్నీ ఒకే చోట వుండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు సిఎం తెలిపారు.
దశాబ్ది ఉత్సవాలు’ ఘనంగా జరగాలి
‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు’ ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను మరోసారి ఆదేశించారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన తర్వాత ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతి గురించి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 2 నుంచి రోజు వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సిఎం కెసిఆర్‌కు వివరించారు. దేశం గర్వించేలా నిర్మించుకున్న డా. బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విధి నిర్వహణకు అనువుగా గొప్పగా నిర్మాణమయ్యిందని, అధికారులు సిబ్బంది ఆహ్లాదకరవాతావరణంలో పనిచేస్తున్నారని సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు.

సచివాలయం ప్రారంభించుకుని నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సచివాలయంలో మౌలిక వసతులు పూర్తవ్వడం గురించి, సౌకర్యాలు అందుబాటులోకి రావడం గురించి సిఎస్ శాంతికుమారిని సంబంధిత ఉన్నతాధికారులను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సిలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి,దేశపతి శ్రీనివాస్, ఎంఎల్‌ఎలు జీవన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ దేశ్ పాండే, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సింగరేణి సిఎండి శ్రీధర్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఇఇ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News