Wednesday, January 8, 2025

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,35,27,925

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925గా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సవరించిన ఓటరు జాబితాను సోమవారం విడుదల చేసింది. మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925 కాగా, వారిలో 1,66,41,489 మంది పురుష ఓటర్లు, 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపింది. దీనిలో 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 5,45,026 మంది, 85 సంవత్సరాల పైబడిన వారు 2,22,091 మంది ఉన్నారు. ఎన్నారై ఓటర్లు 3,591, ప్రత్యేక ప్రతిభావంతులు 5,26,993 మంది ఉన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు ఉండగా, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News