Friday, December 20, 2024

పన్నుల రాబడి భేష్

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు కాగ్ కితాబు

2022-23లో మించి పన్ను వసూళ్లు రూ. 1,26,606 కోట్లు
టార్గెట్ వసూలైంది రూ.1,26,617కోట్లు గడ్డు పరిస్థితుల్లోనూ
గట్టెక్కిన తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండికొట్టిన కేంద్రం
రుణాలపై ఆంక్ష.. కేంద్ర నిధుల్లో కోత అయినా కలబడి నిలబడిన రాష్ట్రం

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్థ్ధిక వనరుల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆంక్ష లు విధించినా, మరెన్నో రకాలుగా ఆర్థ్ధికంగా దెబ్బకొట్టాలని ప్రయ త్నించినా, సొంత ఆదాయాన్ని పెంచుకొంటూ వెనుకంజ వేయ కుండా గట్టిగా నిలబడ్డ రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొం దిందని అధికార వర్గాలంటున్నా యి. రాజకీయ పరమైన కారణాలతో కేంద్ర ప్ర భుత్వం ఏక పక్షంగా రుణాల రూపంలో నిధుల సేకరణకు అనేక ఆంక్షలు విధించిం దని, దాంతో వేల కోట్లను నష్ట పో వాల్సి వచ్చిందని, అంతేగాక తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్ర భుత్వ పథకాలను డా తగ్గించడంతో ఆ భారాన్ని అదనంగా మో స్తున్న ప్రభుత్వానికి ఆర్థ్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ భరిం చామని, దీనికితోడు గ్రాంట్-ఇన్-ఎయిడ్ ని ధుల్లో ఏకంగా 68 శాతం నిధుల్లో కేంద్రం కోత విధించినప్ప టికీ ఎక్కడా వెనుకంజ వేయకుండా, తలవం చకుండా, గట్టిగా నిలబడ్డ రాష్ట్రంగా తెలం గాణ నిలిచిందని దేశంలోని ఇతర రాష్ట్రాలే కా కుండా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-కాగ్) లోని కొందరు సీనియర్ అధికారులు కొ నియాడారని ఆ అధికారులు వివరించారు.

ఎంత టి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తెలంగాణ రాష్ట్రం నిల దొక్కుకోగలదనే విషయం జాతీయస్థాయిలో స్పష్ట మైందని, అంతేగాక కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ విషయం బోధపడిందని ఆ అధికారులు వివరించారు. 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వనరులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-కాగ్)కు సమగ్ర నివేదికను అందజేశామని, ఆ నివేదికపై కాగ్‌లోని కొందరు సీనియర్ అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రం గడ్డు పరిస్థితు ల్లో కూడా గట్టిగా నిలదొక్కుకుందని కితాబు ఇ చ్చారని వివరించారు. సాధారణంగా కాగ్ అధికారులు రాష్ట్రాల ఆదాయాలు, వ్యయాలపై అనేక ర కాలుగా విమర్శలు చేస్తూ లోపాలను ఎత్తిచూపు తూ అక్షింతలు వేస్తూ ఉంటారని, కానీ ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థ్ధిక నిర్వహణపై ఎలాంటి లోపాలు ఎత్తిచూపలేదని, చేసిన ఖర్చులపైన కూ డా కాగ్ ఎలాంటి కామెంట్స్ చేయలేదని ఆ అధికారులు వివరించారు.

వాస్తవానికి 2022-23వ ఆ ర్థ్ధిక పన్నుల రూపంలో 1,26,606 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశామని, ఆర్థ్ధిక సంవత్సరం ముగిసేనాటికి 2023 మార్చి 31వ తేదీ నాటికి 1,26,617 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, అంటే అంచనాల కంటే మరో 11 కోట్ల రూపాయలు అదనం గా నిధులు వచ్చాయని వివరించారు. సహజం గా ఏ రాష్ట్రమైనా ఆదాయాన్ని సమకూర్చుకునే అంచనాల్లో ఆశించిన నిధుల కంటే తక్కువగానే ఆదా యం వస్తుందని, దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు రెవెన్యూ లోటుతోనే అతికష్టంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నడుస్తున్నాయని, కానీ ఒక్క తెలంగా ణ రాష్ట్రమే ప్రతికూల పరిస్థితుల్లో కూడా రెవెన్యూ మిగులుతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకున్నామని వివరించారు. కాకుంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు అడుగడుగునా అడ్డంకులు, ఇబ్బందులు సృ ష్టించడం మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు.

గ్రాంట్ల రూ పంలో కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా 41 వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి రావా ల్సి ఉందని, కానీ అందులో కేవలం 13,179 కో ట్లు మాత్రమే వచ్చాయని, అంటే రావాల్సిన నిధు ల్లో కేవలం 32 శాతం మాత్రమే వచ్చాయని, దాం తో 27,821 కోట్ల రూపాయలను తెలంగాణ రా ష్ట్రం నష్టపోవాల్సి వచ్చిందని వివరించారు. అంతేగాక రుణాల రూపంలో నిధుల సమీకరణతో 52, 167 కోట్ల రూపాయల నిధులు వస్తాయని బడ్జెట్ లో అంచనా వేయగా కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యల మూలంగా కేవలం 32,119 కోట్ల రూపాయలను మత్రమే సమీకరించుకోగలిగామని, ఈ విధంగా మరో 20,048 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చిందని వివరించారు. ఇలా ఒక్క 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వ కక్ష్య సాధింపుల మూలంగా ఏకంగా 47,869 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చిందని ఆ అధికారులు వివరించారు.

అందుకే ఈలెక్కలన్నీ క్షుణ్ణంగా తెలిసి న కాగ్ కొందరు సీనియర్ అధికారులు కూడా తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం పడ్డకష్టాలను అర్థ్ధంచేసుకొని అభినందించారని ఆ అధికారులు వివరించా రు. ఒక్క ఆర్థ్ధిక సంవత్సరంలోనే ఏకంగా 47,869 కోట్ల రూపాయలను ఒక రాష్ట్రం నష్టపోవడమంటే చిన్న విషయం కాదని, చాలా పెద్ద దెబ్బేనని, అ యినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సకాలంలో మేల్కొని సొంతగా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యల మూలంగానే భారీగా ఆదాయాన్ని సమకూర్చుకొని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, వ్యవసాయ పథకాలకు ఎలాం టి ఢోకా లేకుండా నిధులను ఖర్చు చేయగలిగామ ని ఆ అధికారులు సగర్వంగా వివరించారు.

కేంద్రం కొట్టిన దెబ్బకు భారీగా ఆర్థ్ధికంగా నష్టపోయి న ఖజానా లోటును భర్తీ చేయడానికి పన్నుల ఆ దాయం, సొంత ఆదాయాన్ని సమకూర్చుకునే పనిపై మరింత దృష్టిపెట్టి, ఎక్కడైనా విస్మరించిన అంశాలను కూడా వదిలిపెట్టకుండా నిక్కచ్చిగా, ని జాయితీగా పన్నులు వసూలు చేయడంతో మరిం త కొంత ఆదాయం పెరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు, పారిశ్రామికవేత్త లు, వ్యాపారులు, ఐటి, ఫార్మా రంగాల్లో నుంచి ని జాయితీగా పన్నులు చెల్లిస్తూ రావడంతోనూ, ప్ర త్యామ్నాయ ఆదాయ మార్గాల ద్వారా నిధులను సమీకరించుకోవడంతో విజయవంతంగా గట్టెక్కామని తెలిపారు. జిఎస్‌టి పన్నుల రూపంలో 41, 888 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, స్టాంపులు-, రిజిస్ట్రేషన్ల విభాగం నుంచి 14,228 కోట్ల రూపాయలు, అమ్మకం పన్నుల రూపంలో 29,604 కోట్ల రూపాయలు, ఎక్సైజ్ పన్నుల రూ పంలో 18,470 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్ర వాటాగా కేవలం 13,994 కోట్ల రూపాయలు, ఇతర పన్నుల రూపంలో మరో 8,430 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు.

ఇవి కాకుం డా పన్నేతర ఆదాయంగా 19,553 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని వివరించారు. ఇలా 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల అంచనాలు 1,93,039 కోట్ల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం కొట్టిన దెబ్బకు, కేంద్రం చేసిన అన్యాయాలకు కేవలం 1,59,349 కోట్ల రూపాయలకే పరిమితం కావాల్సి వచ్చిందని, కేంద్రం మూలంగా నష్టపోయిన 47,869 కోట్ల రూపాయల నిధులు కూడా వచ్చి ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కళ్లు చెదిరిపోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలు జరిగివుండేవని ఆ అధికారులు వివరించారు. గత ఆర్థ్ధిక సంవత్సరంలో వేతనాల కోసం 35,266 కోట్లు, పింఛన్ల కోసం 15,816 కోట్లు, రాయితీల కోసం 9,628 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

అంతేగాక 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరంలో సాధారణ రంగాలపై మొత్తం 50, 362 కోట్లు ఖర్చు చేయగా, అత్యధికంగా సామాజిక రంగాలపై 60,475 కోట్లను ఖర్చు చేశారు. ఆర్థ్ధికరంగంపై 60,011 కోట్లను ఖర్చు చేశామని, ఖ ర్చుల్లో ఎలాంటి దుబారా లేకుండా, ప్రభుత్వ పాలనలో కాస్తంత పిసినారితనంతో వ్యవహరించడం మూలంగానే 6,508 కోట్ల రెవెన్యూ మిగులును సాధించగలిగామని సగర్వంగా తెలిపారు. ఇక కేంద్రం కొట్టిన దెబ్బతో 32,119 కోట్ల ఆర్థ్ధికలోటు ఏర్పడిందని, అయినప్పటికీ నికర లోటును 11,166 కోట్లకు తగ్గించుకోగలిగామని ఆ అధికారులు వివరించారు. ఇంతకంటే మెరుగైన ఆర్థ్ధిక దేశంలోని మరే ఇతర రాష్ట్రమైన చేయగలుగుతుందో చెప్పండి అని ఆ అధికారులు వ్యా ఖ్యానించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యూ హాత్మకమైన ఆర్థ్ధిక నిర్వహణే కొనసాగుతుందని ఆ అధికారులు ధీమాను వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News